అగ్రికల్చర్‌ డిప్లొమా తర్వాత ఏం చేయాలి?

అగ్రికల్చర్‌లో డిప్లొమా పూర్తిచేసిన తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్‌ డిగ్రీ చేయడం చాలా ఉపయోగకరం. ఇలా చేసిన విద్యార్థులకు ఎన్నో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

Published : 20 May 2020 00:08 IST

* అగ్రికల్చర్‌ డిప్లొమా తర్వాత ఏం కోర్సు చేస్తే మేలు? - హరీష్‌ వర్మ

* అగ్రికల్చర్‌లో డిప్లొమా పూర్తిచేసిన తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్‌ డిగ్రీ చేయడం చాలా ఉపయోగకరం. ఇలా చేసిన విద్యార్థులకు ఎన్నో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవసాయ శాఖల్లో, పరిశోధనా రంగంలో, ప్రైవేటుసంస్థలతో పాటు ఎన్‌జీఓల్లోకి నియమించుకుంటున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కోర్సు చదవడానికి అగ్రిసెట్‌ ప్రవేశపరీక్షలు రాయాలి. తెలంగాణ ఎంసెట్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌, ఐసీఏఆర్‌ నిర్వహించే ఏఐఈఈఏ (యూజీ) ప్రవేశపరీక్షల ద్వారా అగ్రికల్చర్‌ బీఎస్సీ చదవాలనుకుంటే బైపీసీతో ఇంటర్మీడియట్‌ లేదా అగ్రికల్చర్‌లో డిప్లొమా లేదా తత్సమాన అర్హత పొంది ఉండాలి. ఏఐఈఈఏ (యూజీ) ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు పొందితే దేశవ్యాప్తంగా ఉన్న అగ్రికల్చర్‌ కళాశాలల్లో బీఎస్సీ చదివే అవకాశం దక్కుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని