డెయిరీయింగ్‌ తర్వాత ఏం చేయవచ్చు?

డెయిరీయింగ్‌లో ఒకేషనల్‌ కోర్సు పూర్తిచేశానన్నారు కానీ దీంతో పాటు ఇంకా ఏయే సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. పదో తరగతి అర్హతతోనూ డెయిరీ టెక్నాలజీలో డిప్లొమా చేసే అవకాశం ఉంది.

Published : 21 May 2020 00:40 IST

డెయిరీయింగ్‌లో ఒకేషనల్‌ కోర్సు పూర్తిచేశాను. తర్వాత ఉన్న విద్యావకాశాలు ఏమిటిి? - ఎస్‌. చంద్రశేఖర్‌

డెయిరీయింగ్‌లో ఒకేషనల్‌ కోర్సు పూర్తిచేశానన్నారు కానీ దీంతో పాటు ఇంకా ఏయే సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. పదో తరగతి అర్హతతోనూ డెయిరీ టెక్నాలజీలో డిప్లొమా చేసే అవకాశం ఉంది. ఇంటర్‌ తర్వాత డెయిరీ టెక్నాలజీలో ఉన్నత విద్య అంటే బి.వాక్‌ (B. Voc.) - బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ చేయవచ్ఛు ఇంటర్లో మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివివుంటే డెయిరీ టెక్నాలజీలో బీటెక్‌ లేదా బీఎస్‌సీ చేరవచ్ఛు ఇవే కాకుండా డెయిరీయింగ్‌కు దగ్గర సంబంధం ఉన్న ఫుడ్‌ టెక్నాలజీ లాంటి కోర్సులూ అందుబాటులో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని