డేటాసైన్స్‌లో పీజీ ఎలా?

మీరు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతూనే ఎంఎస్సీ డేటాసైన్స్‌ కోర్స్‌ గురించి ఆలోచించడం...

Published : 25 May 2020 01:04 IST

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో డిగ్రీ చేయాలనుకుంటున్నా. ఆపై ఎంఎస్సీ డేటాసైన్స్‌ చదవాలనుంది. వీలవుతుందా? ఎంఎస్సీ డేటాసైన్స్‌ను అందించే ప్రముఖ సంస్థలేంటి?
- నవీన్‌ కుమార్‌

మీరు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతూనే ఎంఎస్సీ డేటాసైన్స్‌ కోర్స్‌ గురించి ఆలోచించడం అభినందనీయం. డిగ్రీని మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో చదవాలనుకొంటున్నారు కాబట్టి డేటాసైన్స్‌ సబ్జెక్ట్‌లోకి ప్రవేశించబోతున్నట్టే . మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుల్లో ఆసక్తి, పట్టు ఉన్నవారికి డేటా సైన్స్‌ చదవడం సులువు. డేటాసైన్స్‌ లో నిష్ణాతులు అవ్వడానికి తార్కిక, విశ్లేషణాత్మక నైపుణ్యాలు చాలా అవసరం. ప్రస్తుతానికి మనదేశంలో డేటా సైన్స్‌కి సంబంధించి కొన్ని వర్సిటీలు మాత్రమే ఎం.ఎస్‌సి కోర్సును అందిస్తున్నాయి. మీరు డిగ్రీ పూర్తి చేసేనాటికి చాలా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్రీయ, రాష్ట్ర, ప్రయివేటు యూనివర్సిటీలు ఎంఎస్సీ డేటాసైన్స్‌, ఎంఎస్సీ బిగ్‌ డేటా, ఎంఎస్సీ డేటా ఎనలిటిక్స్‌ లాంటి కోర్సులని అందిస్తాయి. ఇవి కాకుండా విదేశాల్లో చాలా విశ్వవిద్యాలయాలు ఈ కోర్సుని అందిస్తున్నాయి. అప్పటికి మీరు ఎంబీఏ వైపు వెళ్లాలనుకొంటే డేటాసైన్స్‌ అప్లికేషన్స్‌ ఎక్కువగా ఉండే ఎంబీఏ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ లాంటి కోర్సులనూ చదవవచ్ఛు

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని