ఫుడ్‌ టెక్నాలజీ డిగ్రీ తర్వాత ఏం చేయాలి?

బీఎస్సీ (ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌) చదువుతున్నాను. ఈ విభాగంలో ఉన్నత విద్యకు ఉన్న అవకాశాలేమిటి? ....

Updated : 30 Oct 2020 04:49 IST

బీఎస్సీ (ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌) చదువుతున్నాను. ఈ విభాగంలో ఉన్నత విద్యకు ఉన్న అవకాశాలేమిటి? డిగ్రీ తర్వాత ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి?

- సీహెచ్‌. జ్ఞాపిక

బీఎస్సీ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ చదివే విద్యార్థులు ఆహార తయారీ, నిల్వ, శుద్ధి (ప్రాసెసింగ్‌) లాంటి అంశాలపై పట్టు సాధిస్తారు. వాటితో పాటుగా ప్రాసెస్డ్‌ ఫుడ్‌లకు సంబంధించిన నాణ్యత నిర్వహణ, పరిశోధన అంశాలూ నేర్చుకుంటారు. ఈ డిగ్రీ ఉత్తీర్ణులకు ఫుడ్‌ టెక్నాలజిస్ట్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్‌, బయోకెమిస్ట్‌, రిసెర్చ్‌ సైంటిస్ట్‌, ఫుడ్‌ సైంటిస్ట్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌ లాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

ఉన్నత విద్యకు సంబంధించి బీఎస్సీ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేసిన విద్యార్థులు ఫుడ్‌ బయోటెక్నాలజీ, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌, మైక్రోబియల్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ లాంటి విభాగాల్లో ఎమ్మెస్సీ చేయవచ్ఛు కాదనుకుంటే ఎంబీఏ చేసి ఆహార పరిశ్రమల్లో మేనేజర్‌ ఉద్యోగాలను అందుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని