ఎంబీబీఎస్‌లో చేరే వీలుందా?

బీఎస్సీ (బీజడ్‌సీ) 2018లో పూర్తిచేశాను. తరువాత ఖాళీగా ఉన్నాను. నాకిప్పుడు 24 ఏళ్లు....

Published : 02 Nov 2020 01:10 IST

బీఎస్సీ (బీజడ్‌సీ) 2018లో పూర్తిచేశాను. తరువాత ఖాళీగా ఉన్నాను. నాకిప్పుడు 24 ఏళ్లు. ఎంబీబీఎస్‌ చదవాలనే ఆసక్తి ఉంది. నాకు అవకాశముందా?

- చైతన్య ప్రకాష్‌

నదేశంలో ఎంబీబీఎస్‌ చదవాలనుకునే వారు టెన్‌ ప్లస్‌ టూ విధానంలో ఇంటర్మీడియట్‌ను బయాలజీ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటుగా ఎన్‌.టి.ఎ వారు ఏటా నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)లో మంచి ర్యాంకు తెచ్చుకున్నవారికి ఎంబీబీఎస్‌ చదివే అర్హత ఉంది. ఇక వయసు విషయానికొస్తే నీట్‌ రాసేవారికి కనీసం 17 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్‌ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్‌ క్రీమీ లేయర్‌), పీడబ్ల్యూడీ) కేటగిరీ వారికి 5 సంవత్సరాల వెసులుబాటు ఉంది. మీ వయసు 24 సంవత్సరాలు కాబట్టి, మీరు జనరల్‌ కేటగిరీకి చెందిన వారయితే ఒక్క సంవత్సరం, రిజర్వ్‌డ్‌ కేటగిరీకి చెందినవారైతే ఇంకో ఆరు సంవత్సరాల పాటు నీట్‌ రాసే అవకాశముంది. భారత సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి 25 సంవత్సరాలు నిండినవారూ నీట్‌ రాయవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌
 

కెరియర్‌, ఉన్నతవిద్యలపై మీ సందేహాలను మాకు పంపండి. నిపుణులు సమాధానాలు ఇస్తారు.
చదువు, ఈనాడు కార్యాలయం,
అనాజ్‌పూర్‌, హయత్‌నగర్‌ మండలం,
రామోజీ ఫిల్మ్‌సిటీ - 501 512

edc@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని