ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో పీజీ ఎలా?

బీటెక్‌ (ఈసీఈ) చివరి సంవత్సరం చదువుతున్నా. ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో ఎంఎస్‌ చేయాలనుంది. నాకు అర్హత ఉందా?

Published : 08 Feb 2021 00:57 IST

బీటెక్‌ (ఈసీఈ) చివరి సంవత్సరం చదువుతున్నా. ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో ఎంఎస్‌ చేయాలనుంది. నాకు అర్హత ఉందా?

- సీహెచ్‌. మోహన్‌ కృష్ణ

* ఎం.ఎస్‌.సి./ ఎం.ఎస్‌. ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ పీజీ స్థాయి జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సు. ఐటీ, కంప్యూటర్స్‌ సైన్స్‌, టెలికమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసినవారికి ఇది సరైన ఎంపిక. కొన్ని విశ్వవిద్యాలయాలు ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో పీజీ చేయటానికి బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ గానీ ఐటీ గానీ చదివితేనే ప్రవేశాలు కల్పిస్త్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు మాత్రం బీటెక్‌ ఈసీఈ వారినీ అనుమతిస్తున్నాయి. ఐటీ సిస్టమ్స్‌, సర్వీసెస్‌లో సెక్యూరిటీ సిస్టమ్స్‌ది చాలా కీలకమైన పాత్ర. ఒక స్కిల్డ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌కు ఇంటర్నెట్‌ సెక్యూరిటీ, నెట్‌ వర్క్‌ సెక్యూరిటీ¨, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, సిస్టమ్స్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ అంశాల మీద మంచి పట్టు ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని