సాఫ్ట్‌వేర్‌లోకి ఎలా?

బీటెక్‌ (మెకానికల్‌) పూర్తి చేశాను. కానీ నాకు సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్లాలని ఉంది. మార్గమేంటి?

Updated : 22 Feb 2021 01:57 IST

బీటెక్‌ (మెకానికల్‌) పూర్తి చేశాను. కానీ నాకు సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్లాలని ఉంది. మార్గమేంటి? - విజయ్‌ ప్రకాష్‌

ఇంజినీరింగ్‌కు సంబంధించి మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ లాంటి బ్రాంచీల విద్యార్థులు చాలామంది ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కొలువులకు మొగ్గు చూపడం ఎప్పటినుంచో చూస్తున్నాం. మీరు బీటెక్‌ (మెకానికల్‌)  చదివారు కాబట్టి, సాఫ్ట్‌వేర్‌కు ఎంతో ముఖ్యమైన కోడింగ్‌ నైపుణ్యాన్ని నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. Java, C, C+ లతో పాటు  కంప్యూటర్‌ కోడింగ్‌, కంప్యూటర్‌ టెస్టింగ్‌లపై పట్టు సాధిస్తే, మీరు ఆశించినట్లు సాఫ్ట్‌వేేర్‌ రంగంలో అడుగుపెట్టవచ్చు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌కి ప్రత్యేకమైన కాడ్‌, క్యామ్‌లను నేర్చుకోవడం ద్వారా సాఫ్ట్‌వేేర్‌ రంగంలోని మెకానికల్‌ విభాగంలో ఉద్యోగాలకు అర్హులవుతారు. ఇవే కాకుండా మ్యాత్‌ లాబ్‌, పైథాన్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌ లాంటి కోర్సులు నేర్చుకొని అనలిటిక్స్‌ రంగం వైపు కూడా వెళ్ళవచ్చు. సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ వెబ్‌సైట్‌ లోకి వెళ్లి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వారికి  కంప్యూటర్‌ రంగంలో అందుబాటులో ఉన్న కోర్సుల గురించి తెలుసుకోండి; నచ్చిన కోర్సును ఎంచుకొని శిక్షణ తీసుకోండి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని