పర్యావరణంలో పీజీ ఎలా?

బీఎస్‌సీ (బీజడ్‌సీ) పూర్తిచేశాను. ఎంఎస్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ చదవాలనుంది. నేను అర్హుడినేనా? దూరవిద్య ద్వారా చదివే అవకాశముందా?

Published : 22 Mar 2021 01:14 IST

బీఎస్‌సీ (బీజడ్‌సీ) పూర్తిచేశాను. ఎంఎస్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ చదవాలనుంది. నేను అర్హుడినేనా? దూరవిద్య ద్వారా చదివే అవకాశముందా?

- జి. కోటేశ్వర్‌,  ఆదిలాబాద్‌

ర్యావరణ శాస్త్రం (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌)లో పీజీని కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా, కాకతీయ, శ్రీవేంకటేశ్వర, ఆంధ్ర, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంది. దూరవిద్య ద్వారా కూడా చదవవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ యూనివర్సిటీ, డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలు మాత్రమే ఎంఎస్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సును దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి. రెగ్యులర్‌గా చదవడానికి ఆయా యూనివర్సిటీల ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం పొందవచ్చు. దూరవిద్యలో చదవాలనుకుంటే ఆ విశ్వవిద్యాలయాల ప్రవేశ ప్రకటన వెలువడినపుడు దరఖాస్తు చేసి ప్రవేశం పొందవచ్చు.
ఎంఎస్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో బోటనీ, ఎకాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, జాగ్రఫీ, పర్యావరణం, వాతావరణం లాంటివి బోధిస్తారు. ఈ కోర్సు చదివినవారికి ఎన్విరాన్‌మెంటల్‌ కన్సల్టెంట్‌గా, ఎన్విరాన్‌మెంటల్‌ అటార్నీగా, సస్టెయినబిలిటీ స్పెషలిస్ట్‌గా, ఎన్విరాన్‌మెంటల్‌ సైంటిస్ట్‌గా, పొల్యూషన్‌ కంట్రోల్‌ నిపుణుడిగా, పర్యావరణ విధాన నిపుణుడిగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల్లో ఉపాధి అవకాశాలున్నాయి. ఈ కోర్సుకు విదేశాల్లోనూ ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇదే సబ్జెక్టులో పీహెచ్‌డీ చేసి బోధన రంగంలో ఉపాధి పొందవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని