పరిశోధనకు ఏ కోర్సులు?

బీఎస్‌సీ (బీజడ్‌సీ) చదువుతున్నాను. రిసెర్చ్‌ కోర్సులను చదవాలనుంది. నా విద్యా నేపథ్యానికి సంబంధించిన కోర్సులను తెలపండి.

Published : 29 Mar 2021 00:49 IST

* బీఎస్‌సీ (బీజడ్‌సీ) చదువుతున్నాను. రిసెర్చ్‌ కోర్సులను చదవాలనుంది. నా విద్యా నేపథ్యానికి సంబంధించిన కోర్సులను తెలపండి.

- జి. త్రివేణి

* బీఎస్‌సీ (బీజడ్‌సీ) చదివిన తరువాత బోటనీ/ జువాలజీ/ కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/ జెనెటిక్స్‌/ మైక్రో బయాలజీ/ బయో ఇన్ఫర్మాటిక్స్‌/ ఇమ్యునాలజీలో పీజీ చేసి పరిశోధన వైపు వెళ్ళవచ్చు. ముందుగా మీరు ఏ సబ్జెక్టులో పీజీ చేయాలనుకొంటున్నారో, ఏ యూనివర్సిటీలో చదవాలనుకొంటున్నారో నిర్ణయించుకోవాలి. ఎంచుకున్న యూనివర్సిటీల వెబ్‌సైట్ల ద్వారా ప్రవేశ పరీక్షల వివరాలను తెలుసుకోవాలి. గత సంవత్సర ప్రవేశ పరీక్షల పరీక్షపత్రాలను పరిశీలించి పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకోండి. పీజీ పూర్తి చేశాక, యూజీసీ- సీఎస్‌ఐఆర్‌ నిర్వహించే జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌/ నెట్‌లో కానీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్‌ పరీక్షలో కానీ ఉత్తీర్ణత సాధించాలి. ఏదైనా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలో ప్రవేశం పొంది, పరిశోధన చేయండి. విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో పోస్ట్‌ డాక్టొరల్‌ రిసెర్చ్‌ని కూడా చేయవచ్చు. కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఐదు  సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సునూ అందిస్తునాయి.ఆసక్తి ఉంటే ఆయా వర్సిటీల వెబ్‌సైట్‌లను సందర్శించి మరిన్ని వివరాలను తెలుసుకోండి.

- ప్రొ. బి.రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని