బ్యాంకు పరీక్షలకు నాకు అర్హత ఉందా?

సీఏ ఇంటర్మీడియట్‌ పరీక్షకు సిద్ధమవుతున్నాను. పూర్తిచేస్తే బ్యాంకు పరీక్షలకు నాకు అర్హత ఉంటుందా?

Published : 05 Apr 2021 00:55 IST

సీఏ ఇంటర్మీడియట్‌ పరీక్షకు సిద్ధమవుతున్నాను. పూర్తిచేస్తే బ్యాంకు పరీక్షలకు నాకు అర్హత ఉంటుందా?

- సుమాంజలి

మీరు సీఏ ఇంటర్మీడియట్‌ పరీక్షకు సిద్దమవుతున్నారు కాబట్టి సీఏ ఫైనల్‌ పూర్తయ్యేవరకు ఎలాంటి ఉద్యోగ ఆలోచనలూ లేకుండా శ్రద్ధతో చదివి సీఏ ఫైనల్‌ని విజయవంతంగా పూర్తి చేయండి. ఒకవేళ మీరు సీఏ ఇంటర్మీడియట్‌తోనే చదువు ఆపేయాలనుకొంటే, దాంతో పాటు డిస్టెన్స్‌ లేదా ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బీ కామ్‌ డిగ్రీనీ పూర్తిచేయండి. ఇటీవలే యూజీసీ వారు సీఏ (ఫైనల్‌)ని పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీకి సమానంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు ఉద్యోగమార్కెట్‌లో సీఏ ఇంటర్మీడియట్‌ని అనధికారికంగా గ్రాడ్యుయేషన్‌కు సమానంగా గుర్తిస్తున్నారు. అధికారికంగా మాత్రం ఎలాంటి ఉత్తర్వులూ లేవు. ప్రభుత్వరంగ బ్యాంకులతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ సీఏ ఫైనల్‌ పూర్తిచేయడం కనీస అర్హత. మీరు సీఏ ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన తరువాత, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఆరు సబ్జెక్టులు పూర్తిచేసి బీకామ్‌ డిగ్రీని పొందవచ్చు. సీఏ పూర్తి చేశాక ప్రభుత్వరంగ సంస్థల్లో, బ్యాంకుల్లో, బహుళజాతి, అంతర్జాతీయ సంస్థల్లో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు పొందవచ్చు. సీఏ ఇంటర్‌తో కూడా మీరు చాలా ప్రైవేటు రంగ సంస్థల్లో,  ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలకు అర్హులవుతారు. సీఏతో పాటుగా జి.ఎస్‌.టి., ఈఆర్‌పీ, వివిధ దేశాల టాక్స్‌ సిస్టమ్‌ల్లో ప్రత్యేక శిక్షణ పొందితే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని