ఎలక్ట్రానిక్స్‌లో ఉన్నత విద్య

బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌) చివరి సంవత్సరం చదువుతున్నాను. నాకున్న ఉన్నతవిద్య అవకాశాలను తెలపండి.,...

Published : 03 May 2021 00:40 IST

బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌) చివరి సంవత్సరం చదువుతున్నాను. నాకున్న ఉన్నతవిద్య అవకాశాలను తెలపండి. 

- బండారి ఈశ్వర్‌

మీరు ఎంఎస్సీ (ఎలక్ట్ట్రానిక్స్‌) చదివే అవకాశం ఉంది. బీఎస్సీలో ఎలక్ట్ట్రానిక్స్‌తో పాటు మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ లాంటి సబ్జెక్టులు కూడా చదివివుంటే  ఆ సబ్జెక్టుల్లో కూడా పీజీ చేసే అవకాశం ఉంది. డిజిటల్‌ ఎలక్ట్ట్రానిక్స్‌, అప్లైడ్‌ ఎలక్ట్ట్రానిక్స్‌, సెమీ కండక్టర్స్‌, రిమోట్‌ సెన్సింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మొబైల్‌ కమ్యూనికేషన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, నానో టెక్నాలజీ, మెటీరీయల్‌ సైన్స్‌, ఐఓటీ, డేటా  అనలిటిక్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, పైతాన్‌ లాంటి సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌ /పీజీ కోర్సులు చేయొచ్చు. మీరు ఎంఎస్సీ (ఎలక్ట్ట్రానిక్స్‌) లేదా దానికి సంబంధించిన పీజీ  విద్యార్హతతో గేట్‌ రాసి ఎంటెక్‌లో పైన చెప్పిన విభాగాల్లో నచ్చిన అడ్వాన్స్‌డ్‌ కోర్సుని కూడా చదవవచ్చు.ఎలక్ట్ట్రానిక్స్‌ సంబంధ అంశంలో పీహెచ్‌డీ కూడా  చేసే వీలు ఉంది.  

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని