జర్నలిజంలో భవిత?

ఇంజినీరింగ్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) చదువుతున్నాను. తర్వాత జర్నలిజంలో చేరాలనివుంది. భవిష్యత్తు ఎలావుంటుంది?

Updated : 12 Jul 2021 01:36 IST

ఇంజినీరింగ్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) చదువుతున్నాను. తర్వాత జర్నలిజంలో చేరాలనివుంది. భవిష్యత్తు ఎలావుంటుంది?

- శ్రీనిఖిత, హైదరాబాద్‌

ఇటీవలికాలంలో మీడియా చానల్స్‌ ఎక్కువ అవడం వల్ల జర్నలిజం కోర్సులకు బాగా ఆదరణ పెరిగింది. కమ్యూనికేషన్‌ రంగంలో వస్తోన్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా జర్నలిజం కోర్సుల్లో కూడా వివిధ స్పెషలైజేషన్లను ప్రారంభించారు. ఈ మార్పుల వల్ల జర్నలిజం చదివినవారికి విభిన్న ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. జర్నలిజం కోర్సును సాధారణంగా మాస్‌ కమ్యూనికేషన్‌తోగానీ, మీడియా స్టడీస్‌తోగానీ కలిపి బోధిస్తారు. జర్నలిజం చదివిన తర్వాత ప్రింట్‌ మీడియా, టెలివిజన్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌, అడ్వర్‌టైజింగ్‌ రంగాల్లో కెరియర్‌ను ప్రారంభించవచ్చు. సామర్థ్యమున్నవారు ఈ రంగంలో స్వయంగా సంస్థను ప్రారంభించి మరికొంత మందికి ఉపాధి కల్పించవచ్చు. జర్నలిజం అనేది ప్రొఫెషనల్‌ కోర్సు. ఇలాంటి కోర్సులకు పరిజ్ఞానంతోపాటు నైపుణ్యం కూడా చాలా అవసరం. ముఖ్యంగా భావ వ్యక్తీకరణ, కనీసం రెండు భాషలపై పట్టు జర్నలిజంలో ప్రధానం. మీకీ రంగం మీద విపరీతమైన ఆసక్తి ఉంటే.. నిరభ్యంతరంగా జర్నలిజం కోర్సును చదవొచ్చు. ప్రస్తుతం మీరు చదువుతోన్న కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సు కూడా జర్నలిజం, మాస్‌ మీడియా రంగాల్లో కెరియర్‌కు బాగా ఉపయోగపడుతుంది. వీడియో ప్రొడక్షన్‌, రేడియో ప్రొడక్షన్‌, కన్వర్టెంట్‌ ప్రొడక్షన్‌ లాంటి సాంకేతిక రంగాల్లో రాణించే అవకాశాలున్నాయి. జర్నలిజం కోర్సులు చదివినవారు జర్నలిస్ట్‌గా, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా, కంటెంట్‌ రైటర్స్‌గా, ఎడిటర్స్‌గా కెరియర్‌ని ప్రారంభించవచ్చు. కెరియర్‌ ప్రారంభంలో అంత ఆకర్షణీయమైన వేతనాలు పొందలేనప్పటికీ ఉద్యోగానుభవంతో మంచి ఎదుగుదలని ఆశించవచ్చు. 

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని