బిజినెస్‌ అనలిటిక్స్‌ ఎక్కడుంది?

బీకామ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ చదవాలనుంది . హైదరాబాద్‌లో ఏయే కాలేజీల్లో ఈ కోర్సు ఉంది?

Published : 19 Jul 2021 01:04 IST

బీకామ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ చదవాలనుంది . హైదరాబాద్‌లో ఏయే కాలేజీల్లో ఈ కోర్సు ఉంది? - ఎం నాగరాజు

బీకామ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌  కోర్సును హైదరాబాద్‌ చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ మహిళా డిగ్రీ కళాశాలల్లో అందిస్తున్నారు. ఇంకా చాలా కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. లయోలా అకాడెమీ సికిందరాబాద్‌, సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌, భారతీయ విద్యాభవన్‌, వివేకానంద కాలేజ్‌, అవినాష్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌, బద్రుక కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌, ప్రగతి మహా విద్యాలయ, ఆంధ్ర మహిళాసభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌, జాహ్నవి డిగ్రీ కాలేజ్‌, ప్రగతి డిగ్రీ కాలేజ్‌, నోబుల్‌ డిగ్రీ కాలేజ్‌, ఆర్‌ జి కేడియా కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌, గీతాంజలి విమెన్స్‌ డిగ్రీ కాలేజ్‌, సిద్దార్థ డిగ్రీ కాలేజ్‌, ధ్రువ డిగ్రీ కాలేజ్‌, కేశవ్‌ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ సైన్సెస్‌, మేఘన డిగ్రీ కాలేజ్‌, తపస్య డిగ్రీ కాలేజ్‌..వాటిలో కొన్ని. మీకు డిగ్రీలో బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు చేయాలనుకొంటే బీబీఎ బిజినెస్‌ అనలిటిక్స్‌ కూడా అందుబాటులో ఉంది. సిలబస్‌ పరంగా బీకామ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌, బీబీఎ బిజినెస్‌ అనలిటిక్స్‌ల మధ్య పెద్ద తేడా లేదు. 

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని