విదేశాల్లో ఎంఏ చేయాలంటే?

మీరు నిరభ్యంతరంగా విదేశీ యూనివర్సిటీల్లో ఎంఏ చదవవచ్చు. కొన్ని విదేశీ వర్సిటీలు మాత్రం నాలుగు సంవత్సరాల డిగ్రీ చదివిన వారికే ఎంఏలో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.

Updated : 09 Aug 2021 06:39 IST

దిల్లీ యూనివర్సిటీలో బీఏ పొలిటికల్‌ సైన్స్‌ చదువుతున్నాను. విదేశీ విశ్వవిద్యాలయంలో ఎంఏ చదవాలని కోరిక. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా యూనివర్సిటీల్లో చదవాలంటే ప్రవేశపరీక్ష ఏమైనా రాయాలా?

- పి. సాయిశ్రీ

మీరు నిరభ్యంతరంగా విదేశీ యూనివర్సిటీల్లో ఎంఏ చదవవచ్చు. కొన్ని విదేశీ వర్సిటీలు మాత్రం నాలుగు సంవత్సరాల డిగ్రీ చదివిన వారికే ఎంఏలో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. చాలా విదేశీ విశ్వవిద్యాలయాలు ఆంగ్ల భాషకు సంబంధించిన పరీక్ష స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఆంగ్ల భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షించడం కోసం టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌, పీటీఈ లాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వివిధ దేశాల్లోని వివిధ యూనివర్సిటీలు ఒక్కో రకమైన పరీక్షలో వచ్చిన స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. కొన్ని యూనివర్సిటీలు ఈ మూడు పరీక్షల్లో ఏ పరీక్ష ద్వారానైనా ప్రవేశాలు కల్పిస్తాయి. అతి తక్కువ యూనివర్సిటీలు మాత్రమే ఎలాంటి ప్రవేశ పరీక్షా లేకుండా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మీరు ఎంఏ తరువాత పీహెచ్‌డీ చేయాలనుకొంటే ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ  పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఉంది. విదేశీ యూనివర్సిటీల్లో పీజీ చేయాలంటే ఖర్చు లక్షల్లో ఉంటుంది. అతి కొద్ది యూనివర్సిటీలు మాత్రమే అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని