మెకానికల్‌ తర్వాత ఐటీ కొలువు..

మూడేళ్ల కిందట మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. ఐటీ రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే ఏ కోర్సు చదవాలి?

Published : 23 Aug 2021 00:49 IST

మూడేళ్ల కిందట మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. ఐటీ రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే ఏ కోర్సు చదవాలి?

- అజయ్‌ చారి

* మెకానికల్‌ ఇంజినీరింగ్‌ తరువాత ఐటీ రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే ముందుగా కొన్ని ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకోవాలి. వాటిలో ముఖ్యంగా సీ, సీ ప్లస్‌ప్లస్‌, పీహెచ్‌పీ, ఆర్‌ఓఆర్‌, జావా, జావా స్క్రిప్ట్‌, హెచ్‌టీఎంఎల్‌ 5 లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌కి మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంటే ఆ రంగానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ నేర్చుకొనే ప్రయత్నం చేయండి. కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ఎంచుకుని వారికి కంపెనీ ప్రాజెక్ట్‌లకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లపై కొంతకాలం ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో నియమించుకొంటాయి. మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు కాబట్టి, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రంగంలో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌కు సంబంధించిన క్యాడ్‌, మేట్‌ క్యాడ్‌, ఫినైట్‌ ఎలిమెంట్‌ అనాలిసిస్‌, వీబీఏ, మేట్‌ ల్యాబ్‌, మెకాని కాల్క్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌లను నేర్చుకోవచ్చు. ఒకవేళ డేటా అనలిటిక్స్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే మైక్రోసాఫ్ట్‌ ఎక్సెల్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌, టేబ్ల్యు, పైతాన్‌, ఎస్‌ఏఎస్‌, అపచే స్పార్క్‌, ర్యాపిడ్‌ మైనర్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌ల గురించీ  ఆలోచించవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న మీ సీనియర్‌లనూ, మిత్రులనూ అడిగి ఏయే సాఫ్ట్‌వేర్‌లను నేర్చుకొంటే ఉద్యోగావకాశాలు ఎక్కువో తెలుసుకుని, ఆ దిశలో ప్రయత్నాలు చేయండి. 

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని