ఉపాధి అవకాశాలు ఎలా?

బీఎస్సీ ( బీజెడ్‌సీ) చదివాను. ఎమ్మెస్సీలో కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయోటెక్నాలజీ, మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్‌ల్లో ఏది చదివితే ఉద్యోగావకాశాలు...

Updated : 06 Dec 2021 19:17 IST

బీఎస్సీ ( బీజెడ్‌సీ) చదివాను. ఎమ్మెస్సీలో కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయోటెక్నాలజీ, మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్‌ల్లో ఏది చదివితే ఉద్యోగావకాశాలు బాగుంటాయి?

- మురళీ కిరణ్‌

* ఎమ్మెస్సీలో కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయోటెక్నాలజీ, మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్‌ల్లో ఏ కోర్సు చదివినా కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు మాత్రమే అర్హత పొందుతారు. ఈ రెండు కోర్సులూ విభిన్నమైనవీ, ప్రత్యేకమైనవీ. మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది, ఏ రంగంలో స్థిరపడాలనుకొంటున్నారు అనే విషయాలను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. పరిశోధన, బోధన రంగాల్లో ఆసక్తి, విదేశాల్లో స్థిరపడాలన్న అభిలాష లాంటివీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. ఏ యూనివర్సిటీల్లో చదవాలనుకొంటున్నారో, ఆ వర్సిటీల సిలబస్‌ను గమనించి ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకోండి.

కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయోటెక్నాలజీ అప్లైడ్‌ సైన్స్‌ కోర్సు అయితే మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్‌ అనేది కొంతవరకు బేసిక్‌ సైన్స్‌ అని చెప్పవచ్చు. రెండు కోర్సుల్లోనూ పరిశోధనకు విస్తృత అవకాశాలున్నాయి. రెండు కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి.

- ప్రొ. బి.రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని