MBA: ఎంబీఏకు ఉద్యోగానుభవం అవసరమా?

గత ఏడాది డిగ్రీ పాసయ్యాను. ఎలాంటి ఉద్యోగానుభవమూ లేకుండా 2022లో ఎంబీఏలో చేరవచ్చా? - రిషిత

Updated : 27 Sep 2021 07:23 IST

గత ఏడాది డిగ్రీ పాసయ్యాను. ఎలాంటి ఉద్యోగానుభవమూ లేకుండా 2022లో ఎంబీఏలో చేరవచ్చా?

- రిషిత

వివిధ విద్యాసంస్థలు ఇచ్చే అడ్మిషన్‌ నోటిఫికేషన్ల ప్రకారం ఎంబీఏ చదవడానికి ఉద్యోగానుభవమేదీ అవసరం లేదు. కానీ ఈ అనుభవం ఉన్న వారికి ప్రాంగణ నియామకాల్లో మంచి కొలువులూ, ఎక్కువ వేతనాలూ లభించే అవకాశం ఉంటుంది. ఎక్కువ డిమాండ్‌ ఉన్న ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఎంబీఏ ముందు వరసలో ఉంటుంది. ఏ ప్రొఫెషనల్‌ కోర్సుకయినా విజ్ఞానంతో పాటు మెలకువలు చాలా అవసరం. ఉద్యోగానుభవంతో నేర్చుకోగలిగే కొన్ని ప్రత్యేక మెలకువలను విద్యాసంస్థలు తరగతి గదిలో అందించలేవు. మీరు మేనేజ్‌మెంట్‌ కెరియర్లో అత్యున్నత స్థాయికి వెళ్లాలంటే కనీసం రెండు సంవత్సరాల ఉద్యోగానుభవంతో పాటు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి ఎంబీఏ చదివే ప్రయత్నం చేయండి. 

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని