పరిశోధనకు ఏది మేలు?

బీఎస్సీ (బయోటెక్నాలజీ, మైక్రోబయోలజీ, కెమిస్ట్రీ) చదువుతున్నాను. రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో పనిచేయాలంటే ఎంఎస్సీ బయోటెక్నాలజీ/ ఎంఎస్సీ మైక్రోబయోలజీలో ఏది చదివితే మంచిది?

Updated : 04 Oct 2021 06:04 IST

బీఎస్సీ (బయోటెక్నాలజీ, మైక్రోబయోలజీ, కెమిస్ట్రీ) చదువుతున్నాను. రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో పనిచేయాలంటే ఎంఎస్సీ బయోటెక్నాలజీ/ ఎంఎస్సీ మైక్రోబయోలజీలో ఏది చదివితే మంచిది?

- ఎ. సాయిపవన్‌

* మీరు బీఎస్సీ చదివేప్పుడే రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో పనిచేయాలని ఆలోచించడం అభినందనీయం. బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీలు రెండూ పరిశోధనకు బాగా అవకాశమున్న రంగాలే. లైఫ్‌ సైన్సెస్‌లో ముఖ్యమైన విభాగాలే. రెండు కోర్సుల్లో చదివే సిలబస్‌లో సారూప్యం ఉంటుంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో రెండు నుంచి మూడు సెమిస్టర్లు.. ఈ రెండు కోర్సులవారు ఒకే తరగతి గదిలో కలిసే చదువుతారు. ఈ రెండు విభాగాల్లో పరిశోధనాంశాలు కూడా చాలావరకు ఒకేలా ఉంటాయి. మీకు అమితాసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని, ప్రాథమికాంశాలు, అప్లికేషన్స్‌ బాగా నేర్చుకొని మేలైన పరిశోధనలు చేసే ప్రయత్నం చేయండి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని