డిగ్రీ ఏ సబ్జెక్టులతో...?

మా అమ్మాయి ఇంటర్మీడియట్‌ (కంప్యూటర్స్‌, ఎకనామిక్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌) బెంగళూరులో చదువుతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో హైదరాబాద్‌కు మారుతున్నాం.

Updated : 25 Oct 2021 06:28 IST

మా అమ్మాయి ఇంటర్మీడియట్‌ (కంప్యూటర్స్‌, ఎకనామిక్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌) బెంగళూరులో చదువుతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో హైదరాబాద్‌కు మారుతున్నాం. అక్కడ ఏయే సబ్జెక్టులతో డిగ్రీ చదివితే బాగుంటుంది?

- చక్రధర్‌

* మీ అమ్మాయి ఇంటర్‌లో చదువుతున్న మూడు సబ్జెక్టుల్లో దేనిలోనైనా డిగ్రీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ దిశలో కొంత పురోగతి ఉండవచ్చు. అప్పుడు మరిన్ని కోర్సులు చదివే అవకాశాలూ ఉంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యావిధానం ప్రకారం మీ అమ్మాయి బీఏ ఎకనామిక్స్‌ కానీ, బీకాం కంప్యూటర్స్‌ కానీ, బీబీఏ కానీ చదవొచ్చు. ఇవే కాకుండా బీఏలో జర్నలిజం, సైకాలజీ, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌ లాంటి ఏ సబ్జెక్టులైనా చదవవచ్చు. ఇవేకాకుండా ఆసక్తి ఉంటే ఫ్యాషన్‌ టెక్నాలజీ, మల్టీ మీడియా, ఫైన్‌ ఆర్ట్స్‌, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సుల గురించి కూడా ఆలోచించవచ్చు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

-  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని