డిప్లొమా తర్వాత బీటెక్‌...

రెండేళ్ల కిందట డిప్లొమా చదివాను. బ్యాక్‌లాగ్‌ ఉంది. సాఫ్ట్‌వేర్‌ కోర్సులను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను బీటెక్‌/ బీఈ రెగ్యులర్‌ విధానంలో చదవాలంటే వీలవుతుందా?

Updated : 01 Nov 2021 01:59 IST

రెండేళ్ల కిందట డిప్లొమా చదివాను. బ్యాక్‌లాగ్‌ ఉంది. సాఫ్ట్‌వేర్‌ కోర్సులను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను బీటెక్‌/ బీఈ రెగ్యులర్‌ విధానంలో చదవాలంటే వీలవుతుందా?

- వి.ఎస్‌.ఎన్‌. మణిధర్‌

* మీరు ముందుగా డిప్లొమాలో ఉన్న బ్యాక్‌లాగ్‌ను పూర్తిచేసుకోండి. ఆ తరువాత ఈసెట్‌ ప్రవేశపరీక్ష రాసి మూడు సంవత్సరాల బీటెక్‌/బీఈని రెగ్యులర్‌ విధానంలో చదవొచ్చు. ఈసెట్‌ రాయాలంటే, డిప్లొమాలో కనీసం 45% మార్కులు పొంది ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీలకు 40% మార్కులు సరిపోతాయి. 200 మార్కులకు నిర్వహించే ఈసెట్‌లో 50 ప్రశ్నలు మ్యాథమేటిక్స్‌, 25 ప్రశ్నలు ఫిజిక్స్‌, 25 ప్రశ్నలు కెమిస్ట్రీ, మిగిలిన 100 ప్రశ్నలు సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో ఇస్తారు. అన్ని  ప్రశ్నలూ మల్టిపుల్‌ చాయిస్‌ రూపంలో ఉంటాయి. మీరు సాఫ్ట్‌వేర్‌ కోర్సులను ఇప్పుడైనా, ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తరువాతైనా నేర్చుకోవచ్చు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని