పది ప్రశ్నలతో పరీక్షిద్దాం!

సివిల్‌ సర్వీసెస్‌ అంటే.. సుదీర్ఘకాలం వెచ్చించి సన్నద్ధం కావాల్సిన అత్యుత్తమ పరీక్ష. దీనిపై ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థి మనసుల్లో ఉండే సందేహం...

Updated : 24 Nov 2021 11:00 IST

సివిల్‌ సర్వీసెస్‌ అంటే.. సుదీర్ఘకాలం వెచ్చించి సన్నద్ధం కావాల్సిన అత్యుత్తమ పరీక్ష. దీనిపై ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థి మనసుల్లో ఉండే సందేహం... ‘ఈ పరీక్షలో నెగ్గటానికి కావాల్సిన లక్షణాలూ, ప్రతిభా నాకున్నాయా?’ అనేదే. ఈ విషయంలో సందేహాతీతంగా స్పష్టత ఏర్పరుచుకుంటే... పూర్తి స్థాయి సన్నద్ధతకు పూర్వరంగం సిద్ధం చేసుకున్నట్టే!

సివిల్స్‌ శిక్షణ కోసం మొట్టమొదటిసారి కోచింగ్‌ కేంద్రాలకు వచ్చే విద్యార్థులూ, తల్లిదండ్రులూ అక్కడి నిర్వాహకులను సాధారణంగా ఈ ప్రశ్నలు అడుగుతారు.
సివిల్‌ సర్వీసెస్‌ మా అబ్బాయి/ అమ్మాయికి సరైన కెరియర్‌ అవుతుందా?
ఈ సర్వీస్‌ను ఆశించటానికీ, అర్హత పొందటానికీ తగిన లక్షణాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు గ్రహించటం చాలా అవసరం.

సరైన కెరియరేనా?
ఇరవయ్యేళ్ల వయసులో విద్యార్థులు పబ్లిక్‌ సర్వీస్‌ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. బహుశా సినిమాలూ, సోషల్‌ మీడియా, సర్వీస్‌లో ఉన్న వ్యక్తుల ద్వారా దీని గురించి ఎంతో కొంత గ్రహిస్తారు. సామాజిక మాధ్యమాల్లో ఉండే కొద్ది వీడియోలను చూస్తే సివిల్స్‌ గురించిన సంపూర్ణమైన స్పష్టత రాదు. ఈ రంగంలోని ప్రొఫెషనల్స్‌ను సంప్రదిస్తేనే వాస్తవికాంశాలు సమగ్రంగా, సమతూకంగా తెలుస్తాయి.

ఎన్ని తర్జనభర్జనలు తర్వాతయినా సముచితమైన సూచన- ‘ఈ కెరియర్‌ను ఇష్టపడితే ముందుకు సాగిపో’. దీనిలో చేరిన కొన్నేళ్ల తర్వాత మరో విభిన్నమైన వృత్తిలోకి వెళ్లగలిగే అవకాశం సివిల్స్‌ ఇస్తుంది. మరే ఇతర కెరియర్‌లోనూ ఇంత అవకాశం ఉండదు. పైగా సెలవు పెట్టి అకడమిక్‌ నైపుణ్యాలు పెంచుకున్నాక తిరిగి విధుల్లోకి చేరే అవకాశం ఇందులో ఉంటుంది.

తగిన గుణాలున్నాయా?
ముందుచూపు, లక్ష్యాల సాధనకు అవసరమైన నిరంతర కృషి, సామర్థ్యం, పారదర్శకత, నిజాయితీ, పేదల పట్ల సహానుభూతి..ప్రాథమికంగా ఇవి ఉండటం సివిల్‌ సర్వెంట్లకు అవసరం. సివిల్స్‌ ర్యాంకరుకు ఉండాల్సినవి కూడా ఇవే. ఈ లక్షణాలను రాతపరీక్షలో, ఇంటర్వ్యూలో విభిన్న పద్ధతుల్లో పరీక్షిస్తారు.    సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక కావాలంటే..విద్యార్హతలతోపాటు కష్టపడేతత్వమూ ఎంతో అవసరం. దీంతోపాటుగా ప్రవర్తనపరమైన కొన్ని ప్రత్యేక లక్షణాలూ ఉండాలి. ఇవి సహజసిద్ధంగా వచ్చినవై ఉండాలి. లేదా నిర్దేశిత సమయంలో వీటిని అలవరుచుకోవడానికి తగినంతగా ప్రయత్నించాలి. ఈ ప్రత్యేక లక్షణాలు ఉన్న ఎవరైనా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయడానికి సిద్ధంకావచ్చు.

సివిల్స్‌ సత్తా- 2
కింది ప్రశ్నలు సివిల్స్‌పై మీకో స్పష్టమైన ఆలోచన రావడానికి తోడ్పడతాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడం ద్వారా మీ అర్హత స్థాయిని తెలుసుకోవచ్చు.

- వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్‌ ట్రీ

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని