దూరవిద్యలో ఆయుర్వేదం?
బీఏ చదివాను. ఆయుర్వేదం, మూలికలపై పట్టు సాధించాను. దూరవిద్యలో ఆయుర్వేదాన్ని చదవడం సాధ్యమవుతుందా? బీఏఎంఎస్ చేయాలనేది నా కోరిక.
- శ్రీనివాసులు, హైదరాబాద్
* మీరు బీఏ చదివి ఆయుర్వేదం, మూలికలపై పట్టు సాధించినా, బీఏఎంఎస్ చేయాలంటే జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్లో మెరుగైన ర్యాంకు సాధించాలి. నీట్ రాయాలంటే ఇంటర్మీడియట్లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలు చదివి ఉండాలి. ఎంబీబీఎస్ కోర్సు లాగే బీఏఎంఎస్ కోర్సును కూడా దూరవిద్యలో చదవడం కుదరదు. కొన్ని ప్రైవేటు సంస్థలు బీఏఎంఎస్‌ను దూరవిద్యలో అందిస్తామని ఇంటర్నెట్లో ప్రకటనలు ఇస్తున్నాయి. అలాంటివాటిని చూసి మోసపోకండి. ఇంజినీరింగ్, మెడిసిన్, లా, మేనేజ్మెంట్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులను రెగ్యులర్ పద్ధతిలో చదవడమే శ్రేయస్కరం. ఆగ్జిలరీ నర్స్ మిడ్వైఫ్ (ఏఎన్ఎం)గా పనిచేస్తున్న వారికోసం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో 6 నెలల కాల వ్యవధితో సర్టిఫికెట్ ఇన్ ఆయుష్ నర్సింగ్ (ఆయుర్వేద) అందుబాటులో ఉంది.
- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
ధర్మవరంలో ఉద్రిక్తత.. భాజపా నేతలపై కర్రలతో వైకాపా వర్గీయుల దాడి
-
World News
china: బీజింగ్, షాంఘైల్లో జీరో కొవిడ్ లక్ష్యం సాధించిన చైనా
-
General News
Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
-
General News
Ts Inter results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా!
-
Sports News
IND vs ENG: కెప్టెన్సీకి పంత్ ఇంకా పరిపక్వత సాధించలేదు: పాక్ మాజీ క్రికెటర్
-
Politics News
Maharashtra: రెబల్స్‌లో సగం మంది మాతో టచ్‌లోనే..: సంజయ్ రౌత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- TS INTER RESULTS 2022: మరికాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాలు ఈనాడు.నెట్లో చూడొచ్చు
- Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
- Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర