సీడీఎస్‌..ఎలా?

సీడీఎస్‌ఈ (కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌)ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వారు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు. డిగ్రీ పూర్తి చేసిన వారు/ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 31 Jan 2022 05:38 IST

గత ఏడాది డిగ్రీ పాసయ్యాను. సీడీఎస్‌ఈ ఓటీఏకు దరఖాస్తు చేసుకోవచ్చా? పరీక్ష విధానం ఎలా ఉంటుంది?

- శ్రావ్య యాదవ్‌

* సీడీఎస్‌ఈ (కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌)ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వారు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు. డిగ్రీ పూర్తి చేసిన వారు/ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 19 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్నవారు అర్హులు. మీకు పైన చెప్పిన అర్హతలుంటే సీడీఎస్‌ఈ ఓటీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఓటీఏ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు. మొదటి పేపర్‌ ఇంగ్లిష్‌, రెండోది జనరల్‌ నాలెడ్జ్‌. ఒక్కో పేపర్‌ వ్యవధి రెండు గంటలు. ఒక్కో దానిలో వంద మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులూ ఉంటాయి. ఇంగ్లిష్‌ విభాగంలో బేసిక్‌ గ్రామర్‌, ఎరర్‌ స్పాటింగ్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, కాంప్రహెన్షన్‌లు ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌లో.. కరెంట్‌ అఫైర్స్‌, హిస్టరీ, జాగ్రఫీ, సైంటిఫిక్‌ యాస్పెక్ట్‌లు ఇస్తారు. 

పరీక్షలో విజయవంతమైనవారిని ఇంటలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌కి పిలుస్తారు. దీన్ని ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ అని కూడా అంటారు. ఐదు రోజులు నిర్వహించే ఇంటర్వ్యూలో మొదటి దశలో ఆఫీసర్‌ ఇంటలిజెన్స్‌ రేటింగ్‌ టెస్ట్‌, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్క్రిప్షన్‌ టెస్ట్‌లు ఉంటాయి. ఈ స్టేజ్‌లో ఉత్తీర్ణత సాధించినవారినే రెండో స్టేజ్‌కి అనుమతిస్తారు. దీనిలో ఇంటర్వ్యూ, గ్రూప్‌ టెస్టింగ్‌, ఆఫీసర్‌ టాస్క్‌,  సైకాలజీ టెస్ట్‌, కాన్ఫరెన్స్‌లు ఉంటాయి. దీనిలోనూ ఉత్తీర్ణత సాధించాక సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ నిర్వహించి ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇస్తారు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని