బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్‌ కోర్సు చేస్తే?

ఎంఏ ఇంగ్లిష్‌ (డిస్టెన్స్‌లో) చేశాను. ప్రైవేటు సంస్థలో సేల్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాను. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఏదైనా సర్టిఫికెట్‌ కోర్సు- డిస్టెన్స్‌లో చేస్తే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

Published : 14 Feb 2022 00:38 IST

ఎంఏ ఇంగ్లిష్‌ (డిస్టెన్స్‌లో) చేశాను. ప్రైవేటు సంస్థలో సేల్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాను. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఏదైనా సర్టిఫికెట్‌ కోర్సు- డిస్టెన్స్‌లో చేస్తే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

- సురేష్‌

బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గానే చదవాలి. ఒకవేళ రెగ్యులర్‌గా చదవడం కుదరకపోతే ఆన్‌లైన్‌లో చదివే ప్రయత్నం చేయండి. డిస్టెన్స్‌ మోడ్‌లో సర్టిఫికెట్‌/డిప్లొమా కోర్సుకు బదులు, ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సుల నాణ్యత- వాటిని అందించే సంస్థల విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అందించే సర్టిఫికెట్‌లకు మార్కెట్లో ఎక్కువ గుర్తింపు ఉంటుంది. జనరల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో కంటే, ఏదైనా స్పెషలైజేషన్‌ లో సర్టిఫికెట్‌/డిప్లొమా కోర్సు చేస్తే ఎక్కువ ఉపయోగకరం.

మీరు సేల్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు కాబట్టి, సేల్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, అడ్వర్ట్టైజింగ్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌, బ్రాండింగ్‌, కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మేనేజ్‌మెంట్‌, రీటెయిలింగ్‌, ఈ-కామర్స్‌, సర్వీసెస్‌ మార్కెటింగ్‌ లాంటి కోర్సులు చేసినట్లయితే మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగ అనుభవం, ఉద్యోగ మెలకువలతో పాటు మెరుగైన విద్యాసంస్థ నుంచి పొందే సర్టిఫికెట్‌ సహాయంతో, మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.  

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు