ఈఈఈతో ఏ కొలువులు?

బీటెక్‌-ఈఈఈలో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు చదువుతారు. ఈ రెండు బ్రాంచిలకు సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయవచ్చు. బీటెక్‌ తరువాత యూపీఎస్‌సీ నిర్వహించే ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ కొలువుల కోసం కృషి

Published : 21 Feb 2022 01:08 IST

బీటెక్‌-ఈఈఈ బ్రాంచికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏ ఉద్యోగావకాశాలుంటాయి?

- కె. శివలీల


బీటెక్‌-ఈఈఈలో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు చదువుతారు. ఈ రెండు బ్రాంచిలకు సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయవచ్చు. బీటెక్‌ తరువాత యూపీఎస్‌సీ నిర్వహించే ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ కొలువుల కోసం కృషి చేయవచ్చు. గేట్‌ రాసి, అందులో మంచి పర్సెంటైల్‌ సాధిస్తే ప్రతిష్ఠాత్మక ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకు వీలుంటుంది. ఇస్రో, బార్క్‌, డీ…ఆర్‌డీఓ లాంటి పరిశోధన సంస్థల్లో కూడా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో, సింగరేణి కాలరీస్‌ లాంటి సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌గా చేరవచ్చు. యూనివర్సిటీల్లో, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో, హాస్పిటల్స్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ల అవసరం ఉంటుంది.

ఇక ప్రైవేటు రంగానికొస్తే- పవర్‌ జెనరేషన్‌ కంపెనీల్లో, సౌరశక్తి సంస్థలు, ఏర్‌పోర్ట్‌లు, విమానయాన సంస్థలు, విద్యుత్‌ పరికరాల తయారీ సంస్థలు, ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ సంస్థలు, మౌలిక సదుపాయాల సంస్థలు, హోటల్స్‌, అపార్ట్‌మెంట్‌ నిర్మాణ సంస్థలు, ఆటోమొబైల్‌ సంస్థలు, ఆటోమేషన్‌ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, పెట్రోలియం సంస్థలు, టెలివిజన్‌, మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థల్లో ఉపాధికి ఆస్కారముంది. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ ఉద్యోగాలూ అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఏదైనా సాఫ్ట్‌ వేర్‌ నేర్చుకొని ఐటీ రంగంలో కానీ, డేటా సైన్స్‌ శిక్షణ పొంది ఎనలిటిక్స్‌ రంగంలో కానీ అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. వీటితో పాటు డిగ్రీ అర్హత ఉన్న అన్ని కేంద్రప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, బ్యాంకింగ్‌ ఉద్యోగాలకు కూడా బీటెక్‌-ఈఈఈ చదివినవారికి అర్హత ఉంటుంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని