ఎన్‌.ఎస్‌.ఎస్‌.తో ఉపయోగం?

పీజీడీసీఏ చేశాను. ఇంటర్‌ చదువుతుండగా ఎన్‌.ఎస్‌.ఎస్‌. సర్టిఫికెట్‌ సంపాదించాను. ఈ సర్టిఫికెట్‌తో ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయో తెలుపగలరు.

Published : 28 Feb 2022 00:44 IST

పీజీడీసీఏ చేశాను. ఇంటర్‌ చదువుతుండగా ఎన్‌.ఎస్‌.ఎస్‌. సర్టిఫికెట్‌ సంపాదించాను. ఈ సర్టిఫికెట్‌తో ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయో తెలుపగలరు.

- రవికుమార్‌

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ‘కేంద్రప్రభుత్వ జాతీయ సేవాపథకం- ఎన్‌ఎస్‌ఎస్‌. ఇది జూనియర్‌ కళాశాలల్లో, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ పరిధిలోని వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులు పాల్గొనడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఎన్‌ఎస్‌ఎస్‌ ఏకైక లక్ష్యం- యువతకు సమాజ సేవానుభవాన్ని అందించడం. ఈ పథకంలో పాల్గొనడం వల్ల అలవడిన సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలు, బృందాల్లో పనిచేయగల శక్తి సామర్థ్యాలు జీవితాంతం ఉపయోగపడతాయి. ఎన్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారికి విద్య, ఉద్యోగాల్లో ఎలాంటి రిజర్వేషన్లూ ఉండవు. కానీ ఇంటర్వ్యూలకు హాజరైనపుడు మీకు ఈ సర్టిఫికెట్‌ ఉండటం వల్ల ఇంటర్వ్యూ బోర్డుకు మీపై సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఉద్యోగం పొందటానికి ఈ సర్టిఫికెట్‌ కొంతమేరకు ఉపయోగపడుతుంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని