ఫార్మ్‌.డి. చదివితే..

ఇంటర్‌ (బైపీసీ) చదివాను. ఆరేళ్ల ఫార్మ్‌.డి. కోర్సు చదివితే లభించే ఉద్యోగావకాశాలు ఏవి?

Updated : 07 Mar 2022 05:34 IST

ఇంటర్‌ (బైపీసీ) చదివాను. ఆరేళ్ల ఫార్మ్‌.డి. కోర్సు చదివితే లభించే ఉద్యోగావకాశాలు ఏవి?

- సీహెచ్‌. రామ్మోహన్‌

* ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదించిన ఆరేళ్ల ప్రొఫెషనల్‌ కోర్సు అయిన ఫార్మ్‌.డి.చదివినవారు రిటెయిల్‌ ఫార్మసిస్ట్‌, క్లినికల్‌ ఫార్మసిస్ట్‌, కమ్యూనిటీ ఫార్మసిస్ట్‌, డ్రగ్‌ అడ్వైజర్‌, అనలిటికల్‌ కెమిస్ట్‌, మెడికల్‌ రైటర్‌, క్లినికల్‌ ట్రయల్స్‌ సైంటిస్ట్‌, ఫార్మకో విజిలెన్స్‌ సైంటిస్ట్‌, లెక్చరర్‌ లాంటి ఉద్యోగాలకు అర్హులవుతారు. వీరు ఫార్మాస్యూటికల్‌ రంగంలో ప్రొడక్షన్‌, టెస్టింగ్‌, క్వాలిటీ కంట్రోల్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఇవేకాకుండా, ఫార్మకో ఎకనమిక్స్‌, ఫార్మకో ఎపిడమాలజీ, క్రోనో ఫార్మకాలజీ, ఫార్మకో జెనోమిక్స్‌, ఫార్మకో జెనెటిక్స్‌ లాంటి విభాగాల్లోనూ ప్రత్యేకమైన ఉద్యోగావకాశాలుంటాయి. విదేశాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మనదేశంలో ఫార్మ్‌.డి కోర్సు పూర్తి చేసినవారికి ఇటీవల కొంత డిమాండ్‌ పెరుగుతోంది. ప్రభుత్వ రంగం కంటే ప్రైవేటు రంగంలోనే వీరికి ఎక్కువ ఉద్యోగాలున్నాయి. ఫార్మ్‌. డి. తరువాత ఫార్మా కంపెనీల్లో, ప్రైవేటు ఆసుపత్రులు, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించే సంస్థలూ, రెగ్యులేటరీ సంస్థలూ, మెడికల్‌ కోడింగ్‌, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల్లో, ఫార్మసీ కళాశాలల్లో ఉపాధి కోసం ప్రయత్నించవచ్చు. 

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని