ప్రైవేటుగా ఎంటెక్‌...

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ ప్రైవేటుగా ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. ఎంటెక్‌ కోర్సును ఏ ప్రైవేటు యూనివర్సిటీలు అందిస్తున్నాయి?....

Updated : 14 Mar 2022 06:40 IST

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ ప్రైవేటుగా ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. ఎంటెక్‌ కోర్సును ఏ ప్రైవేటు యూనివర్సిటీలు అందిస్తున్నాయి?

- మేఘనా పట్నాయక్‌

* ఎంటెక్‌ కోర్సును చాలా ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు రెండు సంవత్సరాల ఫుల్‌టైమ్‌ ప్రోగ్రామ్‌గా అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో మీలాంటి ఉద్యోగుల కోసం ఉస్మానియా యూనివర్సిటీలో, జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ కోర్స్‌ కాలవ్యవధి మూడు సంవత్సరాలు. ఈ కోర్సులో సాయంత్రం తరగతులు నిర్వహిస్తారు. బిట్స్‌ పిలానీలో వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌లో భాగంగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ఆన్‌లైన్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ ఉంది. మీరు పిలానీ వెళ్ళే అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో చదివి, ఆన్‌లైన్‌లో కానీ, ఎంపిక చేసిన నగరాల్లోని  పరీక్షకేంద్రాల్లో కానీ పరీక్షలు రాసి ఎంటెక్‌ కోర్సు పూర్తి చేయవచ్చు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని