అమెజాన్‌లో ఉద్యోగం ఎలా?

మా అమ్మాయి పదో తరగతి చదువుతోంది. అమెజాన్‌ లాంటి సంస్థలో ఉద్యోగం సంపాదించాలంటే ఏ కోర్సు చదవాలి?  

Updated : 16 Mar 2022 06:40 IST

మా అమ్మాయి పదో తరగతి చదువుతోంది. అమెజాన్‌ లాంటి సంస్థలో ఉద్యోగం సంపాదించాలంటే ఏ కోర్సు చదవాలి?

- కె. భాను

* అమెజాన్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలంటే, మీ అమ్మాయిని కనీసం డిగ్రీ చదివించండి. బీటెక్‌ డిగ్రీ చదివితే ఎక్కువ ఉపయోగకరం. బీటెక్‌ ఏ బ్రాంచ్‌లో చేసినా, ఇంజినీరింగ్‌ అర్హత ఉన్న ఉద్యోగాలతో పాటు సాధారణ డిగ్రీ అర్హత ఉన్న చాలా ఉద్యోగాలకు కూడా ప్రయత్నించవచ్చు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డేటా సైన్స్‌ లాంటి బ్రాంచిలు చదివితే ఎక్కువ ఉద్యోగావకాశాలుంటాయి. డిగ్రీ తరువాత ప్రసిద్ధ విద్యాసంస్థల్లో ఎంబీఏ/ఎంటెక్‌ చేసినట్లయితే మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఇంజినీరింగ్‌ కోర్సులయినా, మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ అయినా అత్యుత్తమ జాతీయ విద్యాసంస్థల్లో చదవడం శ్రేయస్కరం. మెరుగైన కెరియర్‌ కోసం విషయ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్‌, ప్రాబ్లెమ్‌ సాల్వింగ్‌, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు, టీంబిల్డింగ్‌, టీంవర్కింగ్‌ స్కిల్స్‌, సృజనాత్మకత చాలా అవసరం.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని