సైకాలజీతో కెరియర్‌

సైకాలజీ అనేది మనసు, మానవ ప్రవర్తనల శాస్త్రీయ అధ్యయనం. మానవులు ఒత్తిడిలో ఎలా పనిచేస్తారు, భాషను ఎలా నేర్చుకుంటారు, విషయాలను ఎలా గుర్తుంచుకొంటారు, తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా సంబంధం కలిగి ఉంటారు అనే విషయాలతో పాటు మానసిక

Updated : 24 Mar 2022 04:56 IST


ఇంటర్‌ తర్వాత మనోవిజ్ఞానశాస్త్రం (సైకాలజీ) చదవాలనుకుంటున్నాను. ఈ కోర్సు చేస్తే కెరియర్‌ ఎలా ఉంటుంది?

- సీహెచ్‌. చర్వి

సైకాలజీ అనేది మనసు, మానవ ప్రవర్తనల శాస్త్రీయ అధ్యయనం. మానవులు ఒత్తిడిలో ఎలా పనిచేస్తారు, భాషను ఎలా నేర్చుకుంటారు, విషయాలను ఎలా గుర్తుంచుకొంటారు, తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా సంబంధం కలిగి ఉంటారు అనే విషయాలతో పాటు మానసిక అనారోగ్యం గురించి అధ్యయనం చేస్తుంది. ఈ కోర్సులో సోషల్‌ సైకాలజీ, కౌన్సెలింగ్‌ సైకాలజీ, కాగ్నిటివ్‌ సైకాలజీ, డెవలప్‌మెంటల్‌ సైకాలజీ, ఎడ్యుకేషనల్‌ సైకాలజీ, క్లినికల్‌ సైకాలజీలతో పాటు హెల్త్‌, ఇండస్ట్రియల్‌ అండ్‌ ఆర్గనైజేషనల్‌, ఆక్యుపేషనల్‌, న్యూరో, స్పోర్ట్‌, ఫోరెన్సిక్‌, ఎన్విరాన్‌మెంటల్‌ లాంటి ఎన్నో విభాగాలున్నాయి. మనోవిజ్ఞానశాస్త్రంలో ముందుగా డిగ్రీ, ఆ తరువాత పీజీ పూర్తిచేసిన తరువాత మీరు చదివిన స్పెషలైజేషన్‌ ఆధారంగా సైకాలజిస్ట్‌గా, సైకో థెరపిస్ట్‌గా, సోషల్‌ వర్కర్‌గా, కౌన్సెలర్‌గా, ట్రెయినర్‌గా, అధ్యాపకులుగా, పరిశోధకులుగా స్థిరపడవచ్చు. ఇవే కాకుండా అడ్వర్‌టైజింగ్‌, మీడియా, కమ్యూనికేషన్‌, మానవ వనరులు, బిజినెస్‌, మేనేజ్‌మెంట్‌ లాంటి రంగాల్లోనూ కొలువులు పొందే అవకాశం ఉంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని