సివిల్స్‌, ఐఎఫ్‌ఎస్‌.. ఏమిటి తేడా?

కొద్ది సంవత్సరాలుగా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)పై అభ్యర్థులకు ఆసక్తి పెరుగుతోంది. ప్రాచుర్యం పొందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాగే అఖిలభారత సర్వీస్‌ అయిన ఐఎఫ్‌ఎస్‌ అద్భుతమైన కెరియర్‌ను అందిస్తుంది

Updated : 31 Mar 2022 05:49 IST

కొద్ది సంవత్సరాలుగా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)పై అభ్యర్థులకు ఆసక్తి పెరుగుతోంది. ప్రాచుర్యం పొందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాగే అఖిలభారత సర్వీస్‌ అయిన ఐఎఫ్‌ఎస్‌ అద్భుతమైన కెరియర్‌ను అందిస్తుంది. 2013 నుంచీ ప్రిలిమినరీ పరీక్షను ఐఎఫ్‌ఎస్‌కూ, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకూ ఉమ్మడి స్క్రీనింగ్‌ టెస్ట్‌గా నిర్ణయించారు.

* మెయిన్‌ పరీక్షలో ఐఎఫ్‌ఎస్‌కు రెండు ఆప్షనల్స్‌. సివిల్స్‌కు ఒకే ఆప్షనల్‌.
* సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ (సీఎస్‌ఈ)కు ఎంచుకునే ఆప్షనల్‌నే ఐఎఫ్‌ఎస్‌ పరీక్షలో ఒక ఆప్షనల్‌గా తీసుకుంటే సమయం, శ్రమ ఆదా అవుతాయి.  
* సీఎస్‌ఈతో పోలిస్తే ఏటా ఐఎఫ్‌ఎస్‌కు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య తక్కువ ఉంటుంది. ప్రకటించే పోస్టుల సంఖ్య కూడా తక్కువే.

* దీంతో ప్రిలిమ్స్‌ కటాఫ్‌ మార్కుల సంఖ్య సీఎస్‌ఈతో పోలిస్తే ఎక్కువ ఉంటోంది! జనరల్‌ అభ్యర్థుల విషయంలో సీఎస్‌ఈ కటాఫ్‌ 2020లో 92.51 మార్కులుంటే.. ఐఎఫ్‌ఎస్‌ కటాఫ్‌ 110.88 మార్కులు ఉంది.
* అందుకే ఐఎఫ్‌ఎస్‌ను సాధించాలనుకునేవారు మొదట ప్రిలిమ్స్‌లో అత్యధిక మార్కుల కోసం ప్రయత్నించాలి! ఈ అత్యధిక మార్కుల లక్ష్యం సీఎస్‌ఈకి కూడా ప్రయోజనకరమే.
* ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌ పరీక్ష సివిల్స్‌ పరీక్షకు కొద్ది వారాలముందు జరుగుతుంది. ఈ పరీక్ష రాసే అనుభవం, సాధన ... సీఎస్‌ఈలోనూ స్కోరింగ్‌కు ఉపకరిస్తుంది.
* ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌ పరీక్షలో నెగ్గినవారు చాలామంది ఈ ఏడాది సీఎస్‌ఈ ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు. ఒక విజయం కలిగించే ఆత్మవిశ్వాసం మరో విజయానికి దారి చూపిస్తుంది!

 

- వి. గోపాలకృష్ణ, బ్రెయిన్‌ ట్రీ


స్టడీ కోట్‌

నేర్చుకుంటూ ఉండేవాళ్లు ఎప్పుడూ యౌవనంలోనే ఉంటారు.
- హెన్రీ ఫోర్డ్‌


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని