పీజీ చేస్తూ కోచింగ్‌ తీసుకోవచ్చా?

డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. గ్రూప్స్‌కి కోచింగ్‌ తీసుకోవాలనుకుంటున్నాను. పీజీ చేస్తూ కోచింగ్‌    తీసుకోవడం మంచిదా? కోచింగ్‌ మీదే దృష్టి పెట్టడం మంచిదా?...

Published : 07 Apr 2022 00:33 IST

డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. గ్రూప్స్‌కి కోచింగ్‌ తీసుకోవాలనుకుంటున్నాను. పీజీ చేస్తూ కోచింగ్‌    తీసుకోవడం మంచిదా? కోచింగ్‌ మీదే దృష్టి పెట్టడం మంచిదా?

- నాగ మద్దిలేటి


డిగ్రీ చేస్తూనే గ్రూప్స్‌కు సన్నద్ధం అవ్వడం మంచిది. మీరు డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలపైనే దృష్టి పెట్టండి. డిగ్రీ పూర్తి చేశాక మీ ముందు మూడు దార్లుంటాయి. అందులో ఒకటి పూర్తి స్థాయిలో గ్రూప్స్‌కి సన్నద్ధం అవ్వడం, రెండోది పీజీ చదివిన తరువాత గ్రూప్స్‌కి సన్నద్ధం అవ్వడం, మూడోది- పీజీ చదువుతూ గ్రూప్స్‌కి కూడా సన్నద్ధం అవ్వడం. పై మూడింటిలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకొనేముందు మీ కుటుంబ ఆర్థిక నేపథ్యం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ గ్రూప్స్‌లో విజయ సాధించలేకపోతే ఏమి చేయాలనుకొంటున్నారో స్పష్టత ఉండాలి. డిగ్రీ తరువాత కనీసం రెండు సంవత్సరాలు పూర్తిగా గ్రూప్స్‌కి సన్నద్ధం అయినట్లయితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నెగ్గకపోతే పీజీ చేయడం కానీ, డిగ్రీ అర్హత ఉన్న ఉద్యోగాలకు ప్రయత్నించడం కానీ చేయాలి. పీజీ చేసిన తరువాత గ్రూప్స్‌కి ప్రయత్నిస్తే మీలో వచ్చిన మానసిక పరిణతి వల్ల గ్రూప్స్‌ పరీక్షల్లో ప్రతిభ కనపర్చవచ్చు. ఒకవేళ, ఈ ప్రయత్నంలో విఫలమైనా పీజీ డిగ్రీతో మెరుగైన ఉద్యోగాలకు  ప్రయత్నించవచ్చు. అయితే... యూపీఎస్‌సీ లాగా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లు ప్రతి సంవత్సరం గ్రూప్స్‌ నోటిఫికేషన్‌లు ఇవ్వడం లేదు. మీరు గ్రూప్స్‌తో పాటు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు కూడా తయారవ్వవచ్చు. అలాంటపుడు మెయిన్స్‌లో మీరు ఎంచుకోబోయే సబ్జెక్టులో పీజీ చేసినట్లయితే, విజయావకాశాలు మెరుగవుతాయి. ఇవి దృష్టిలో పెట్టుకొని సముచితమైన నిర్ణయం తీసుకోండి.

మీరు గ్రూప్స్‌తో పాటు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు కూడా తయారవ్వవచ్చు. అలాంటపుడు మెయిన్స్‌లో మీరు ఎంచుకోబోయే సబ్జెక్టులో పీజీ చేసినట్లయితే, విజయావకాశాలు మెరుగవుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని