ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను ఒకటో తరగతి రెండు సార్లు చదివాను. ఓటీఆర్‌లో ఒకటో తరగతి అడ్మిట్‌ అయిన సంవత్సరం నింపాలా లేదా రెండోసారి చదివిన సంవత్సరాన్ని పేర్కొనాలా?

Published : 23 Apr 2022 01:41 IST

* నేను ఒకటో తరగతి రెండు సార్లు చదివాను. ఓటీఆర్‌లో ఒకటో తరగతి అడ్మిట్‌ అయిన సంవత్సరం నింపాలా లేదా రెండోసారి చదివిన సంవత్సరాన్ని పేర్కొనాలా?      

-ఆండీ

జ: రెండోసారి చదివిన సంవత్సరాన్నే ఓటీఆర్‌లో అప్‌లోడ్‌ చేయండి. అకడమిక్‌ సంవత్సరాల కాలమ్‌ నింపేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది.


* పోటీ పరీక్షలకు అప్లై చేసేటప్పుడు పెళ్లయిన అమ్మాయిల కుల, ఆదాయం, రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్లు ఏ ఇంటిపేరు (భర్త/తండ్రి)తో ఉండాలి?                

- మౌనిక

జ: కుల ధ్రువీకరణ పత్రం అయితే తండ్రి ఇంటి పేరు మీద ఉండాలి. రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. భర్తకు సంబంధించిన ఆదాయాన్ని చెప్పవచ్చు.


ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న స్కూల్‌ సర్టిఫికెట్లలో పుట్టిన సంవత్సరం 1996 అని ఉంది. అయిదో తరగతిలో 1995 అని ఉంది. ఒకటి నుంచి నాలుగు వరకు ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలలో చదివాను. ప్రస్తుతం ఆ స్కూల్‌ను తీసేశారు. స్టడీ సర్టిఫికెట్‌ ఎలా తీసుకోవాలో తెలియజేయండి.  
    

- సాయికృష్ణ

జ: ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు సంబంధించి ఓటీఆర్‌లో తహశీల్దార్‌ సంతకం చేసిన రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ను సమర్పించండి. అందులో మీ పుట్టిన సంవత్సరం 1996 గా పేర్కొనండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని