ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

అటవీ శాఖలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాలంటే తప్పనిసరిగా ఏదైనా సైన్స్‌ గ్రూప్‌తో డిగ్రీ లేదా బీటెక్‌ పూర్తయినవారు అర్హులు. మీది సైన్స్‌ గ్రూప్‌ కిందకు రాదు. కాబట్టి మీరు అనర్హులు.

Published : 25 Apr 2022 01:02 IST

డిగ్రీలో బీఏ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ పూర్తి చేశాను. నాకు అటవీ శాఖలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుకు అర్హత ఉంటుందా?        

      - దేశెట్టి

జ: అటవీ శాఖలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాలంటే తప్పనిసరిగా ఏదైనా సైన్స్‌ గ్రూప్‌తో డిగ్రీ లేదా బీటెక్‌ పూర్తయినవారు అర్హులు. మీది సైన్స్‌ గ్రూప్‌ కిందకు రాదు. కాబట్టి మీరు అనర్హులు.
 

మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-3) స్థాయిలో ఉన్నారు. ఆయన ఆదాయం సంవత్సరానికి రూ.10 లక్షల కంటే ఎక్కువ. నేను బీసీ-బీ కేటగిరీకి చెందినవాడిని. నాన్‌-క్రీమీలేయర్‌ సర్టిఫికెట్‌ నాకు వర్తిస్తుందా?    

        - అబ్దుల్‌

జ: ఫ్యామిలీ ఇన్‌కమ్‌ (కుటుంబ ఆదాయం) సాలీన రూ.8 లక్షలకు మించితే వారు క్రీమీలేయర్‌ పరిధిలోకి వస్తారు. మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీకు నాన్‌-క్రీమీలేయర్‌ వర్తించదు.

టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌ రిజిస్ట్రేషన్‌లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు అడుగుతోంది. ఒకటో తరగతి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదవకపోవడంతో ఆ సర్టిఫికెట్‌ నా దగ్గర లేదు. దానివల్ల ఏదైనా సమస్య ఉందా? రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు కరీంనగర్‌ పట్టణంలో చదివాను.    

                 - పున్నం

జ: ఏ సమస్యా ఉండదు. ఒకటో తరగతి చదివిన ఆ కాలానికి సంబంధించి ఓటీఆర్‌లో కాలమ్‌ నింపుతున్నప్పుడు చదివిన సంవత్సరం, స్థలం, జిల్లా రాస్తే సరిపోతుంది. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు