ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు హైదరాబాద్‌లో, 5వ తరగతి వరంగల్‌లో, 6, 7 తరగతులు వైజాగ్‌లో చదివాను. నేను తెలంగాణ స్థానికత కిందకు వస్తానా లేదా?...

Published : 26 Apr 2022 01:57 IST

నేను ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు హైదరాబాద్‌లో, 5వ తరగతి వరంగల్‌లో, 6, 7 తరగతులు వైజాగ్‌లో చదివాను. నేను తెలంగాణ స్థానికత కిందకు వస్తానా లేదా?

  - హయతి

జ: ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏడో తరగతి వరకు నాలుగేళ్లు వరుసగా ఏ ప్రాంతంలో చదివితే ఆ స్థానికత పొందుతారు. మీరు ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివారు కాబట్టి తెలంగాణ స్థానికత కిందకు వస్తారు.


ఒకటి నుంచి అయిదో తరగతి వరకు సూర్యాపేటలో చదువుకున్నాను. ఆరు నుంచి పదో తరగతి వరకు కుసుమంచి (మండలం), ఖమ్మంలో చదువుకున్నాను. నేను ఏ జిల్లా కిందకు వస్తాను?

- హుస్సేన్‌

జ:  కొత్త నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ ఎక్కడ చదివితే అదే లోకల్‌ అవుతుంది. దాని ప్రకారం మీకు సూర్యాపేట జిల్లా, యాదాద్రి జోన్‌ స్థానికత వర్తిస్తుంది.


ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు కామారెడ్డి జిల్లాలో చదివాను. అయిదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు నిజామాబాద్‌ జిల్లాలో చదివాను. నేను బాసర మండలంలోకి వస్తానా? లేదా రాజన్న సిరిసిల్ల మండలంలోకి వస్తానా?  

- కేతావత్‌

జ: ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు కామారెడ్డి జిల్లాలో చదివారు కాబట్టి మీరు సిరిసిల్ల మండలంలోకి వస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని