ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ను ఎలా పొందవచ్చు. ప్రస్తుత జీవో ప్రకారం పరిమితులు ఏమైనా ఉన్నాయా?

Published : 28 Apr 2022 02:08 IST

ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ను ఎలా పొందవచ్చు. ప్రస్తుత జీవో ప్రకారం పరిమితులు ఏమైనా ఉన్నాయా?

- రాహుల్‌

ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ను తహశీల్దారు వద్ద పొందాలి. ప్రస్తుత జీవో  ప్రకారం కుటుంబ ఆదాయం సాలీన రూ.8 లక్షలకు మించకూడదు, భూమి రెండు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు లాంటి అనేక పరిమితులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం మీ ప్రాంతానికి చెందిన తహశీల్దారు కార్యాలయాన్ని సంప్రదించండి.


 ఒకటి నుంచి మూడో తరగతి వరకు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ లేదు. ఓటీఆర్‌లో ఈ తరగతులకు సంబంధించిన వివరాలను ఎలా పేర్కొనాలి?

  - శివ

ప్రైవేట్‌ అని నింపితే సరిపోతుంది. మిగిలిన తరగతులన్నింటికీ సంబంధించిన బోనఫైడ్‌లు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.


గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష ప్రిపరేషన్‌కు ఎంత సమయం లభిస్తుందో తెలియజేయ గలరు?  

 - సాకేత్‌

గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్షకు మూడు నుంచి నాలుగు నెలల సమయం   ఉండవచ్చు. వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని