ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు లేని స్కూల్‌లో చదువుకున్నాను. అందుకు తహశీల్దార్‌  దగ్గర 1998 నుంచి 2001-02 వరకు స్టడీ సర్టిఫికెట్‌ తీసుకున్నాను. ఓటీఆర్‌లో ప్రాథమిక విద్య వివరాలను నింపేటప్పుడు

Published : 30 Apr 2022 00:50 IST

నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు లేని స్కూల్‌లో చదువుకున్నాను. అందుకు తహశీల్దార్‌  దగ్గర 1998 నుంచి 2001-02 వరకు స్టడీ సర్టిఫికెట్‌ తీసుకున్నాను. ఓటీఆర్‌లో ప్రాథమిక విద్య వివరాలను నింపేటప్పుడు టైప్‌ ఆఫ్‌ స్టడీ ఆప్షన్‌ దగ్గర రెగ్యులర్‌ అని సెలక్ట్‌ చేసుకోవాలా లేదా ఏ విద్యా సంస్థలో చదవలేదు అని నింపాలా తెలియజేయగలరు.        

- దక్కన్న గారి

ఓటీఆర్‌లో ప్రాథమిక విద్య వివరాలను నింపేటప్పుడు టైప్‌ ఆఫ్‌ స్టడీ ఆప్షన్‌లో ప్రైవేట్‌ అని నింపండి.


ఒకటో తరగతిలో పుట్టిన సంవత్సరం 1996 అని ఉంది. రెండో తరగతి నుంచి 10వ తరగతి వరకు 1997 ఉంది. ఓటీఆర్‌ ఎడిట్‌ చేసేటప్పుడు రెండో తరగతి నుంచి ఎంటర్‌ చేస్తే సరిపోతుందా 1వ తరగతి సంవత్సరం కూడా కచ్చితంగా ఉండాలా? ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఒకే స్కూల్‌లో చదివాను.

  -కోడం

పదో తరగతిలో పేర్కొన్న పుట్టిన సంవత్సరాన్నే ఓటీఆర్‌ కాలమ్‌లో నింపండి. 


నేను కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాను. నా ఆదాయం సంవత్సరానికి రూ. 6 లక్షలు. నాన్న రిటైర్డ్‌ ఉద్యోగి. నెలకు రూ.22000 పెన్షన్‌ వస్తుంది. మేము  క్రీమీలేయర్‌ పరిధిలోకి వస్తామా?  

 - శ్రీనివాస్‌

 కుటుంబ ఆదాయం సాలీన రూ.8 లక్షలు మించినవారు క్రీమీలేయర్‌ పరిధిలోకి వస్తారు. మీరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి తండ్రి ఆదాయంతో సంబంధం ఉండదు. మీ ఆదాయం సంవత్సరానికి రూ. 6 లక్షలు కాబట్టి మీకు క్రీమీలేయర్‌ నిబంధన వర్తించదు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని