ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను గతంలో ఓటీఆర్‌ ఫామ్‌లో ఒకటి నుంచి మూడో క్లాస్‌కి సంబంధించిన వివరాలు తప్పుగా ఎంటర్‌ చేశాను. మళ్లీ ఎడిట్‌ చేసి సరిచేశాను. ఉద్యోగ సమయంలో ఏదైనా సమస్య ఉంటుందా?

Updated : 02 May 2022 00:37 IST

నేను గతంలో ఓటీఆర్‌ ఫామ్‌లో ఒకటి నుంచి మూడో క్లాస్‌కి సంబంధించిన వివరాలు తప్పుగా ఎంటర్‌ చేశాను. మళ్లీ ఎడిట్‌ చేసి సరిచేశాను. ఉద్యోగ సమయంలో ఏదైనా సమస్య ఉంటుందా?

- అజయ్‌

జ: ఎటువంటి సమస్యా ఉండదు. ఓటీఆర్‌లో పొరపాటున తప్పుగా ఏమైనా నింపితే సరిచేసుకోవచ్చు.


ప్రస్తుతం ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాను. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3 లేదా గ్రూప్‌-4 ఉద్యోగం సాధించాలని ఉంది. ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలను తెలియజేయండి.

- సాయిరాం

జ: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3 లేదా గ్రూప్‌-4 ఉద్యోగం సాధించాలనుకోవడం మంచి ఆలోచన. పోటీపరీక్షల్లో విజయం సాధించాలంటే ముందుగా సిలబస్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత సంబంధిత పరీక్ష  బేసిక్స్‌పై పట్టు సాధించాలి. కరెంట్‌ అఫైర్స్‌ కోసం రోజూ దినపత్రిక చదవడం, నోట్సు ప్రిపేర్‌ చేసుకోవడం తప్పనిసరి. పాత ప్రశ్నపత్రాలను, చదివిన అధ్యాయాల ప్రశ్నలను తరచూ ప్రాక్టీస్‌ చేయాలి. ఉద్యోగం చేస్తుండటం వల్ల తక్కువ సమయం ఉంటుంది కాబట్టి వీలైతే ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ఫాలో అవడం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని