ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నా డిగ్రీ కన్సాలిడేటెడ్‌ మార్కుల మెమో కనిపించడం లేదు. ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ ఒకటే ఉంది. టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు అప్లై చేయాలంటే కన్సాలిడేటెడ్‌ మార్కుల కార్డ్‌, ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ రెండూ ఉండాలంటున్నారు. యూనివర్సిటీ నుంచి డూప్లికేట్‌...

Published : 03 May 2022 04:41 IST

నా డిగ్రీ కన్సాలిడేటెడ్‌ మార్కుల మెమో కనిపించడం లేదు. ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ ఒకటే ఉంది. టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు అప్లై చేయాలంటే కన్సాలిడేటెడ్‌ మార్కుల కార్డ్‌, ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ రెండూ ఉండాలంటున్నారు. యూనివర్సిటీ నుంచి డూప్లికేట్‌ తెచ్చుకోవడానికి సమయం పడుతుంది. ఈ లోపు ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌తోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా?

- కిష్టు-బన్నీ ఎర్రా

జ: మీకు డిగ్రీలో వచ్చిన మార్కులు గుర్తుంటే ఓటీఆర్‌ని పూర్తిచేయడానికి సరిపోతుంది. ఈలోపు యూనివర్సిటీ నుంచి డిగ్రీ కన్సాలిడేటెడ్‌ మార్కుల మెమో డూప్లికేట్‌ తెచ్చుకోండి.


నా స్వస్థలం వికారాబాద్‌ జిల్లా. చదువు మొత్తం సంగారెడ్డి జిల్లాలో పూర్తయ్యింది. కొత్త జోనల్‌ విధానం ప్రకారం సంగారెడ్డి జిల్లాకి చెందుతాను. నా దగ్గర కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు వికారాబాద్‌లో తీసుకున్నవి (2018) ఉన్నాయి. ఉద్యోగ దరఖాస్తు (ఎస్‌ఐ అండ్‌ కానిస్టేబుల్‌)కు ఇవి సరిపోతాయా లేదా సంగారెడ్డి జిల్లాకి చెందినవి తీసుకోవాలా? నాన్‌-క్రీమీలేయర్‌ సర్టిఫికెట్‌ ఏ జిల్లా నుంచి తీసుకోవాలి?

- వినయ్‌ కుమార్‌

జ: స్వస్థలానికి చెందిన ఎంఆర్‌ఓ కార్యాలయం నుంచే కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, నాన్‌-క్రీమీలేయర్‌ సర్టిఫికెట్‌ను తీసుకోవాలి.


నేను బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాను. జులై/సెప్టెంబరుకి బీటెక్‌ పూర్తవుతుంది. టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు అప్లై చేయడానికి అర్హత ఉంటుందా?

-కార్తీక్‌

జ: ప్రస్తుత సంవత్సరానికి అవకాశం ఉండదు. నోటిఫికేషన్‌ వచ్చేనాటికి పాసై సర్టిఫికెట్‌ చేతిలో ఉంటే రాబోయే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని