ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ లేదు. ఓటీఆర్‌లో ఈ తరగతులకు సంబంధించిన వివరాలను ఎలా పేర్కొనాలి?

Published : 04 May 2022 03:32 IST

ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ లేదు. ఓటీఆర్‌లో ఈ తరగతులకు సంబంధించిన వివరాలను ఎలా పేర్కొనాలి?

- జ్యోతి కిషోర్‌

జ: ఓటీఆర్‌లో వివరాలు నింపేటప్పుడు ప్రైవేట్‌ అని కాలమ్‌లో పూర్తి చేయండి.


ప్రస్తుత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌ఓసీని ఎప్పుడు సమర్పించాలి? అప్లయ్‌ చేసుకునే సమయానికా (లేదా) వెరిఫికేషన్‌ చేసేటప్పుడు సమర్పిస్తే సరిపోతుందా?

-దీక్షిత్‌ కుమార్‌

జ: గ్రూప్‌-1కి దరఖాస్తు చేసుకునే ముందు ప్రస్తుతం మీరు పని చేస్తున్న శాఖాధికారికి తెలియజేయాలి. ఎన్‌ఓసీని వెరిఫికేషన్‌ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.


పదో తరగతి మెమో మిస్‌ అయ్యింది. బోర్డు నుంచి మరొక సర్టిఫికెట్‌ తీసుకున్నాను. కానీ దానిపై డూప్లికెట్‌ అని ఉంది. ప్రస్తుతం డిగ్రీ పూర్తయ్యింది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేద్దామనుకుంటున్నాను. పదో తరగతి సర్టిఫికెట్‌ కారణంగా జాబ్‌ విషయంలో ఏదైనా సమస్య ఉంటుందా?

- వినయ్‌ కుమార్‌

జ: బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ కాబట్టి ఎలాంటి  సమస్యా ఉండదు. నిస్సంకోచంగా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు  చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని