ఉద్యోగం త్వరగా రావాలంటే..?

ఇంటర్‌ (ఎంపీసీ) చదివాను. తర్వాత ఇంజినీరింగ్‌ కాకుండా.. త్వరగా ఉద్యోగం సంపాదించడానికి ఏ కోర్సులు చేయాలి?

Published : 05 May 2022 00:59 IST

ఇంటర్‌ (ఎంపీసీ) చదివాను. తర్వాత ఇంజినీరింగ్‌ కాకుండా.. త్వరగా ఉద్యోగం సంపాదించడానికి ఏ కోర్సులు చేయాలి?

- ఎం.పార్థసారథి నాయుడు

ఇంటర్‌ చదివిన తరువాత త్వరగా ఉద్యోగం సంపాదించాలంటే ప్రాచుర్యమున్న ఏదో ఒక కోర్సులో డిగ్రీ/ ఒకేషనల్‌ డిగ్రీ చేయాలి. ఉదాహరణకు- హోటల్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ సైన్స్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ, డేటా సైన్స్‌, రిటెయిలింగ్‌, ఈ-కామర్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, కోడింగ్‌, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ఆటోమొబైల్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, రెఫ్రిజరేషన్‌, ఏర్‌కండిషనింగ్‌, ఫారిన్‌ ట్రేడ్‌, యానిమేషన్‌, మల్టీమీడియా, విజువల్‌ ఆర్ట్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, వెబ్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైన్‌. మీకు బోధనరంగంపై ఆసక్తి ఉంటే డీ…ఈడీ చేసే అవకాశం ఉంది. లాయర్‌గా స్థిరపడే ఆలోచన ఉంటే ఐదు సంవత్సరాల లా కోర్సు గురించి కూడా ఆలోచించవచ్చు. ఇవే కాకుండా చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, కాస్ట్‌ అండ్‌ వర్క్‌ అకౌంటెంట్‌ లాంటి కోర్సులు చేసినవారికీ డిమాండ్‌ ఉంది. పైన చెప్పిన కోర్సుల్లో ఆసక్తి ఉన్న కోర్సును చదివి, త్వరగా ఉద్యోగం సంపాదించాలనే మీ కల నిజం చేసుకోండి!

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని