ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు తెలంగాణ ఎకానమీ చదవాలా? వెయిటేజీ ఎంత ఉంటుంది? 

Published : 08 May 2022 02:19 IST

* గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు తెలంగాణ ఎకానమీ చదవాలా? వెయిటేజీ ఎంత ఉంటుంది? 

- రవితేజ గోషిక

జ: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు తెలంగాణ ఎకానమీ తప్పనిసరిగా చదవాలి. కరెంట్‌ అఫైర్స్‌లోనూ ఆర్థిక సంబంధ ప్రశ్నలు వస్తాయి. అయితే గ్రూప్‌-1, గ్రూప్‌-2 మెయిన్స్‌లో ఎకానమీకి ఉన్నంత వెయిటేజీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఉండదు.


* టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1కు దరఖాస్తు చేసినప్పుడు డిగ్రీ పూర్తయిన సంవత్సరాన్ని పొరబాటున తప్పుగా అప్‌ చేశాను. ఓటీఆర్‌లో ఎడిట్‌ చేసి రీసబ్మిట్‌ చేస్తుంటే మారడం లేదు. దీనివల్ల ఏదైనా సమస్య ఉంటుందా?

- చంద్రలేఖ కుంచం

జ: ఓటీఆర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ తప్పులను సరిదిద్దడానికే ఉంటుంది. నెట్‌వర్క్‌ సరిగా లేకపోయినా ఒక్కోసారి అప్‌డేట్‌ కాదు. మరొకసారి ప్రయత్నించి చూడండి. అప్పటికీ కాకపోతే సర్వీస్‌ కమిషన్‌ను సంప్రదించండి.


* నేను ఒకటో తరగతి నాగర్‌ కర్నూలు జిల్లాలో; రెండు, మూడు తరగతులు రంగారెడ్డిలో; నాలుగు నుంచి ఆరో తరగతి మహబూబ్‌నగర్‌; ఏడు నుంచి పదో తరగతి వరకు నాగర్‌ కర్నూలు జిల్లాలో చదువుకున్నాను. ఏ జిల్లా లోకల్‌ అవుతుంది? 

- భాగ్యవర్ధం

జ: ఏడో తరగతి ఎక్కడైతే పాసయ్యారో ఆ ప్రాంతంలో లోకల్‌ కిందకు వస్తారు. నాగర్‌ కర్నూలు జిల్లాలో మీరు స్థానికత పొందుతారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని