ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ కమ్యూనికేషన్‌ పరీక్షకు సిద్ధమవుతున్నాను. ఏయే పుస్తకాలు చదవాలో సూచించండి.

Published : 09 May 2022 00:30 IST

* నేను పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ కమ్యూనికేషన్‌ పరీక్షకు సిద్ధమవుతున్నాను. ఏయే పుస్తకాలు చదవాలో సూచించండి.

- ఒక అభ్యర్థి

జ: జనరల్‌ స్టడీస్‌ కామన్‌గా ఉంటుంది. సబ్జెక్ట్‌ విషయానికి వస్తే పాలిటెక్నిక్‌ ఈసీఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌) పుస్తకాలను బాగా చదవండి. వీటికి సంబంధించిన బేసిక్‌ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించండి.


* ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు లేని స్కూల్స్‌లో చదివాను. టీఎస్‌పీఎస్సీ ఎడిట్‌ ఆప్షన్‌లో వీటికి సంబంధించిన వివరాలను ఎలా నింపాలి?         

- శ్రీను

జ: ఓటీఆర్‌ నింపేటప్పుడు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఉన్న కాలమ్‌లో ప్రైవేట్‌ అని పూర్తిచేసి, ఆ కాలానికి సంబంధించి తహసీల్దార్‌ సంతకం చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని జత చేయండి.


* నేను రెండో తరగతి వరకు సూర్యాపేటలో, మూడో తరగతి నకిరేకల్‌లో, నాలుగు, అయిదు తరగతులు  మీర్‌పేట్‌లో, ఆరు నుంచి పదో తరగతి ఉప్పల్‌లో చదివాను. నేను ఏ ప్రాంతంలో స్థానికతను పొందుతాను?

 

- విజయ్‌

జ: మీరు మేడ్చల్‌ స్థానికతను పొందుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని