కేంద్ర కొలువు ఎలా?

ఇంజినీరింగ్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) చివరి సంవత్సరం చదువుతున్నా. కేంద్రప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలనేది నా కోరిక.

Published : 09 May 2022 01:07 IST

ఇంజినీరింగ్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) చివరి సంవత్సరం చదువుతున్నా. కేంద్రప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలనేది నా కోరిక. ఎలా ముందుకుసాగాలి?

- జ్యోత్స్న

ఇతర విభాగాలతో పోలిస్తే కంప్యూటర్‌ సైన్స్‌తో ఇంజినీరింగ్‌ చదివినవారికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు తక్కువగానే ఉంటాయని చెప్పవచ్ఛు వీరికి ఆకర్షణీయమైన వేతనాలతో ప్రైవేటు రంగంలో చాలా ఉద్యోగాలున్నాయి. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారిని కూడా గేట్‌ అర్హతతో, ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాల్లోకి తీసుకొంటాయి. ఎన్‌ఐసీి, ఇస్రో, డీఆర్‌డీవో, బార్క్‌ లాంటి పరిశోధనా సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. వీటితో పాటు స్టీల్‌ ప్లాంట్స్‌, ఇంటలిజెన్స్‌, ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌, రైల్వేల్లో ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్ఛు వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సిస్టమ్స్‌ ప్రోగ్రామర్‌ లాంటి ఉద్యోగాలకు కంప్యూటర్‌ సైన్స్‌తో ఇంజిరింగ్‌ చదివినవారికి అర్హత ఉంటుంది. పైన చెప్పిన చాలా ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకు అదనంగా గ్రూప్‌ డిస్కషన్‌ కూడా ఉండే అవకాశం ఉంది.

ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అయ్యేవారు ఆ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను క్షుణ్ణంగా చదవాలి. దాదాపు అన్ని నియామక పరీక్షలూ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతోనే ఉంటాయి. కొన్ని పరీక్షల్లో నెగిటివ్‌ మార్కులూ ఉండొచ్ఛు రాత పరీక్షలో కనపర్చిన ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపికవుతారు. ఇంటర్వ్యూల్లో థియరీ కంటే అప్లికేషన్‌ల మీద ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలో సరైన సమాధానాలు ఇవ్వటంతో పాటు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కూడా అవసరం. కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు హిందీలో మాట్లాడగలగటం అదనపు అర్హత అవుతుంది. ఇవే కాకుండా డిగ్రీ అర్హత ఉన్న ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ యూపీఎస్‌సీ, ఎల్‌ఐసీ, బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగాలకోసం కూడా ప్రయత్నించవచ్ఛు

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని