ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను. ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. నాకు గ్రూప్‌-1 కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా?

Updated : 17 May 2022 06:31 IST

అంబేడర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను. ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. నాకు గ్రూప్‌-1 కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా?  - గోదల

గ్రూప్‌-1 కు దరఖాస్తు చేసుకునే సమయానికి చేతిలో తప్పనిసరిగా డిగ్రీ సర్టిఫికెట్‌ ఉండాలి. కాబట్టి, ఈ ఏడాదికి మీకు అవకాశం ఉండదు.


తెలంగాణ గ్రూప్‌-1 అసిస్టెంట్‌ డైరెక్టర్‌/సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. కానీ, సోషియాలజీ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన నాకు ఆ పోస్టుకు అర్హత ఉందా?     -వినోద్‌ నాయక్‌

 గ్రూప్‌-1 అసిస్టెంట్‌ డైరెక్టర్‌/సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఇంజినీరింగ్‌ పూర్తి చేసినవారికి కూడా అర్హత ఉంటుంది.


 నేను మూడో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ప్రైవేట్‌ స్కూల్లో బ్రిడ్జ్‌ కోర్స్‌ చదివాను. ఇప్పుడా స్కూల్‌ లేదు. రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ను తెచ్చుకునే విధానాన్ని తెలియజేయండి. -రాము బచ్చనబోయిన

మూడో తరగతి నుంచి ఆరో తరగతి వరకు చదివిన కాలానికి సంబంధించిన రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ను ఆ ప్రాంతానికి చెందిన తహసీల్దార్‌ నుంచి పొందవచ్చు.


డిగ్రీ బీజెడ్‌సీ చేసి, తర్వాత ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పూర్తి చేశాను. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సెట్‌ కూడా పూర్తి చేశాను. తెలంగాణ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ల పోస్టుల దరఖాస్తుకు నాకు అర్హత ఉందా?  - నామ్‌దేవ్‌ చివాటే 

తెలంగాణ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని