ఏడాది అనుభవం కావాలట...

బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ పూర్తి చేశాను. ఎంఎస్సీ చేయాలంటే ఒక సంవత్సరమైనా అనుభవం ఉండాలంటున్నారు. దాని కోసం ఎక్కడ ఉద్యోగం చేయాలో తెలుపగలరు.

Updated : 19 May 2022 06:01 IST

బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ పూర్తి చేశాను. ఎంఎస్సీ చేయాలంటే ఒక సంవత్సరమైనా అనుభవం ఉండాలంటున్నారు. దాని కోసం ఎక్కడ ఉద్యోగం చేయాలో తెలుపగలరు.

- మధుమిత ఆకుల

* బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ చదివే సమయంలో ఏదైనా రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేసే ఉంటారు కాబట్టి, అదే సంస్థలో ఒక సంవత్సరం పనిచేసే ప్రయత్నం చేయండి. వెంటిలేటర్‌లు తయారు చేసే సంస్థల్లో కానీ, వెంటిలేటర్‌ల ఇన్‌స్టలేషన్‌ /సర్వీస్‌ చేసే సంస్థల్లో కానీ పనిచేసి, పీజీ చేయడానికి కావాల్సిన అనుభవాన్ని పొందండి. మీకు ఆసక్తి ఉంటే రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీనే కాకుండా రెస్పిరేటరీ థెరపీలో కూడా పీజీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ రెస్పిరేటరీ థెరపీలో పీజీ చేయాలనుకొంటే ఏదైనా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో పల్మనాలజీ/ ఇంటెన్సివ్‌ కేర్‌/ క్రిటికల్‌ కేర్‌/ అనస్తీషియాలజీ లాంటి విభాగాల్లో కనీసం ఏడాది పాటు పనిచేసి, రెస్పిరేటరీ థెరపీలో పీజీ చేసే ప్రయత్నం చేయండి. 

- బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని