ఎప్పుడు మంచిది?

బీఎస్సీ బీబీసీ (బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ) చివరి సంవత్సరం చదువుతున్నాను. సివిల్స్‌ రాయాలంటే పీజీ చదివేవరకూ ఆగడం మంచిదేనా?

Updated : 23 May 2022 06:30 IST

బీఎస్సీ బీబీసీ (బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ) చివరి సంవత్సరం చదువుతున్నాను. సివిల్స్‌ రాయాలంటే పీజీ చదివేవరకూ ఆగడం మంచిదేనా?

 - సీహెచ్‌. హారిక 

డిగ్రీ తరువాత కనీసం రెండు సంవత్సరాలు పూర్తిగా సివిల్స్‌ పరీక్షకి సన్నద్ధం అయినట్లయితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. పీజీ చదువుతూ కూడా సివిల్స్‌కి సన్నద్ధం అవ్వొచ్చు. మెయిన్స్‌లో మీరు ఎంచుకోబోయే ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లో పీజీ చేసినట్లయితే, మీ విజయావకాశాలు మెరుగవుతాయి. ఇటీవల ఉన్నత విద్యారంగంలో వస్తున్న సంస్కరణల ఫలితంగా డిగ్రీలో సైన్స్‌ చదివినప్పటికీ పీజీలో సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులు కూడా చదివే అవకాశం ఉంది. రెండు సంవత్సరాలు పీజీ చేసిన తరువాత సివిల్స్‌కి ప్రయత్నిస్తే, పోటీ పరీక్షల్లో/ ఇంటర్వ్యూలో మెరుగైన ప్రతిభని కనపర్చవచ్చు. ఒకవేళ మీరు సివిల్స్‌ పరీక్షలో నెగ్గలేకపోతే, పీజీ అర్హతతో ఉన్నత విద్య/ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.

 - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని