ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసేటప్పుడు అనుకోకుండా లాంగ్వేజ్‌ ఆప్షన్‌ ఇంగ్లిష్‌ మీడియంను ఎంచుకున్నాను. ఇప్పుడు పరీక్షలో ప్రశ్నపత్రం కేవలం  ఇంగ్లిష్‌లో మాత్రమే వస్తుందా? లేదా తెలుగు, ఇంగ్లిష్‌ కలిపి రెండు భాషల్లో వస్తుందా? లాంగ్వేజ్‌ ఆప్షన్‌ మార్చుకునే అవకాశం ఉందా?

Published : 23 May 2022 02:19 IST

పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసేటప్పుడు అనుకోకుండా లాంగ్వేజ్‌ ఆప్షన్‌ ఇంగ్లిష్‌ మీడియంను ఎంచుకున్నాను. ఇప్పుడు పరీక్షలో ప్రశ్నపత్రం కేవలం  ఇంగ్లిష్‌లో మాత్రమే వస్తుందా? లేదా తెలుగు, ఇంగ్లిష్‌ కలిపి రెండు భాషల్లో వస్తుందా? లాంగ్వేజ్‌ ఆప్షన్‌ మార్చుకునే అవకాశం ఉందా?

- అనంత్‌

ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్‌ రెండు భాషల్లోనూ ఉంటుంది. కాబట్టి మీరు కంగారుపడాల్సిన అవసరం లేదు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2, గ్రూప్‌-3 నోటిఫికేషన్లు విడుదలైతే ఏమైనా సిలబస్‌ మారే అవకాశం ఉందా?

- సంతోష్‌

ప్రస్తుతానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్స్‌కు సంబంధించిన సిలబస్‌ను మార్చే యోచనలో ఉన్నట్లు ఎలాంటి ప్రకటన  చేయలేదు. కాబట్టి సిలబస్‌ మారే అవకాశం ఏమీలేదు.

ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న సర్టిఫికెట్‌లలో నా పేరు చరణ్‌ తేజ అని ఉంది. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు చంటి అని ఉంది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1కి దరఖాస్తు చేశాను. నా పేరు కారణంగా ఉద్యోగ నియామక సమయంలో ఏదైనా సమస్య ఉంటుందా? ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే పేరు ఎలా మార్చుకోవాలి?

- రాజు

ఒకటి నుంచి అయిదో తరగతి వరకు చదివిన పాఠశాల నుంచి చరణ్‌ తేజ అని పేరు మార్పించుకున్న స్టడీ సర్టిఫికెట్‌ను తెచ్చుకోండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని