నిర్ణయం సరైందేనా?

బీటెక్‌ (ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ) 2015లో పూర్తిచేశాను. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏడేళ్లు పోటీ పరీక్షలు రాసినా నెగ్గలేదు. మళ్లీ ఐటీ రంగంలో కొనసాగాలనే నిర్ణయం సరైందేనా?

Published : 26 May 2022 01:36 IST

బీటెక్‌ (ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ) 2015లో పూర్తిచేశాను. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏడేళ్లు పోటీ పరీక్షలు రాసినా నెగ్గలేదు. మళ్లీ ఐటీ రంగంలో కొనసాగాలనే నిర్ణయం సరైందేనా?

- అబ్దుల్‌ రవూఫ్‌

* బీటెక్‌లో చదువుకున్న కోర్సుకు సంబంధించిన రంగంలో కొనసాగటానికి మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు బీటెక్‌ చదివి 7 సంవత్సరాలు అవుతోంది కాబట్టి, కనీసం సంవత్సరం పాటు వివిధ కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకొనే ప్రయత్నం చేయండి. ఇటీవల కాలంలో ఐటీ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం డేటా సైన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, బిగ్‌ డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లాంటి రంగాలకు చాలా డిమాండ్‌ ఉంది. వీలుంటే  NPTEL, Coursera, Udemy లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లో మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌ లాంటి కోర్సులను చదివే ప్రయత్నం చేయండి. మీ విషయ పరిజ్ఞానాన్ని, భావప్రకటనా సామర్ధ్యాల్ని మెరుగుపర్చుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేయండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని