ఫెలోషిప్స్‌ ఉన్నాయా?

విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేయాలంటే జేఆర్‌ఎఫ్‌ లేకుండా సాధ్యమవుతుందా? పీహెచ్‌డీ విద్యార్థులకు ఫెలోషిప్స్‌ ఉన్నాయా?

Published : 30 May 2022 00:40 IST

విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేయాలంటే జేఆర్‌ఎఫ్‌ లేకుండా సాధ్యమవుతుందా? పీహెచ్‌డీ విద్యార్థులకు ఫెలోషిప్స్‌ ఉన్నాయా?

- బి. ఆంజనేయులు

* సాధారణంగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందాలంటే ఆరు మార్గాలున్నాయి.

1. యూజీసీ / సీఎస్‌ఐఆర్‌ నిర్వహించే జేఆర్‌ఎఫ్‌ పరీక్షలో ఉత్తీర్ణత

2. యూజీసీ / సీఎస్‌ఐఆర్‌ నెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత

3. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత

4. గేట్‌ పరీక్షలో ఉత్తీర్ణత 

5. ఎంఫిల్‌ చేసి ఉండటం

6. వివిధ యూనివర్సిటీలు నిర్వహించే

ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత 

వీటిలో నుంచి ఒక్కో యూనివర్శిటీ ఒక్కో పద్దతిలో పీహెచ్‌డీ ప్రోగ్రాం ప్రవేశాలు నిర్వహిస్తాయి. మీరు ఏ సబ్జెక్ట్‌లో, ఏ యూనివర్సిటీలో ప్రవేశం పొందాలనుకొంటున్నారో ఆ వర్శిటీ వెబ్‌సైట్‌ సందర్శించి వివరాలు తెలుసుకోండి.
జేఆర్‌ఎఫ్‌లో ఉత్తీర్ణత సాధించినవారికి మంచి ఫెలోషిప్‌లు అందుబాటులో ఉన్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేసేవారికి నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌ అందుబాటులో ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పీహెచ్‌డీ చేసేవారికి ఫెలోషిప్‌లను అందిస్తున్నాయి. ఇవికాకుండా సైన్స్‌వారికి డీఎస్‌టీ¨, డీబీటీ ఫెలోషిప్‌లు, సోషల్‌ సైన్స్‌ వారికి ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ ఫెలోషిప్‌లున్నాయి.హిస్టరీ, ఆంత్రొపాలజీ, ఫిలాసఫీ లాంటి  సబ్జెక్ట్‌ల్లో పీహెచ్‌డీ చేసేవారిలో అతి కొద్ది మందికి ఆయా సబ్జెక్ట్‌ల ప్రొఫెషనల్‌ సొసైటీలు ఫెలోషిప్‌లు అందిస్తున్నాయి. కొన్ని ఎన్‌జీవోలు, అంతర్జాతీయ సంస్థలు కూడా అత్యంత ప్రతిభ ఉన్న పీహెచ్‌డీ స్కాలర్‌లకు ఫెలోషిప్‌లను అందిస్తున్నాయి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని